Home » Entertainment » Mahesh Babu Trivikram Movie First Glimpse Video Releasing On Krishna Birthday
Entertainment

Mahesh Babu : డబల్ బ్లాక్ బస్టర్ సర్ప్రైజ్.. మహేష్ బాబు ఫ్యాన్స్ కి పండగ లాంటి న్యూస్ !

Authored By
Breaking News
The Telugu News | Updated on: May 16, 2023, 1:55 pm
Advertisement

Mahesh Babu : నిజంగా సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ కి ఇది డబల్ బ్లాక్ బస్టర్ సర్ప్రైజ్ పండగ లాంటి న్యూస్ అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. మేటర్ లోకి వెళ్తే మహేష్ ప్రతి ఏడాది తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు నాడు మే 31వ తారీకు తన కొత్త సినిమా అప్ డేట్స్ ఇస్తుంటారు అన్న సంగతి తెలిసిందే. అయితే గత ఏడాది కృష్ణ మరణించడం జరిగింది. ఆయన చనిపోయాక వస్తున్న ఈ పుట్టినరోజు నాడు… మహేష్ సెంటిమెంట్ పరంగా యధావిధిగా తన కొత్త సినిమా “SSMB28” టైటిల్ తో కూడిన ఫస్ట్ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు సమాచారం.

Advertisement

Mahesh Babu trivikram movie first glimpse video releasing on krishna birthday

ఈ సినిమాని డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చాయి. అతడు, ఖాలేజా… ఈ రెండు కూడా మహేష్ నటనలో రెండు విభిన్నమైన కోణాలను సిల్వర్ స్క్రీన్ పై కొత్తగా చూపించడం జరిగింది. దీంతో వస్తున్న ఈ మూడో సినిమాతో మహేష్ బాబుని త్రివిక్రమ్ ఏ విధంగా చూపించబోతున్నాడు అన్నది అభిమానులలో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వాస్తవానికి గత ఏడాది ఫిబ్రవరి నెలలో పూజా కార్యక్రమాలు స్టార్ట్ కాగా…

Advertisement

ఆ సమయంలో ఈ ఏడాది ఏప్రిల్ 28వ తారీకు ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ తో కూడిన అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతున్న సమయంలో మహేష్ తల్లి ఇందిరా… తర్వాత సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో షూటింగ్స్ వాయిదా పడి ఇప్పుడు ఏకంగా వచ్చే ఏడాది జనవరి నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా విడుదల చేయనున్నట్లు సమాచారం. చాలాకాలం తర్వాత మళ్లీ మహేష్ సిగరెట్ తాగుతూ ఈ సినిమాలో కనిపించడం విశేషం.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి