
mahesh vitta marriage in september
Mahesh Vitta : మహేష్ విట్టా.. ఇతను పలు సినిమాలలో నటించి మెప్పించడమే కాకుండా బిగ్ బాస్ షోతో ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యాడు. 2017లో నేనే రాజు నేనే మంత్రి సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. యాక్టింగ్ టాలెంట్‌తో పలు సినిమాల్లో అవకాశాలు సంపాదించుకున్న ఆయన బిగ్‌బాస్ రెండో సీజన్‌లో పాల్గొన్నాడు. అయితే తన ఫ్రస్టేషన్‌ను పక్కనవారికి చెప్పుకోవడమే అతడి పాలిట శాపంగా మారింది. నారదుడు అన్న బిరుదును అతడికి అంకితమచ్చారు. అయితే అప్పుడొచ్చిన మహేశ్ విట్టాకు భయముండేది. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొనే మహేష్ విట్టాకు ఫుల్ ధైర్యం ఉందట. బిగ్‌బాస్ తర్వాత ఆదాయం పెరిగింది, ఆటిట్యూడ్ మారింది, సొంత ప్రొడక్షన్ హౌస్ పెట్టి సినిమా కూడా తీశానని చెప్పుకొచ్చాడు మహేశ్.
ప్రస్తుతం బిగ్ బాస్ ఓటీటీలో సందడి చేస్తున్న మహేష్ విట్టా షోకి వెళ్లే ముందు తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తన ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు తెలియజేశాడు. ‘నాలుగేళ్లుగా రిలేషన్‌లో ఉంటున్నాం. ఎంత గొడవపడ్డా వెంటనే కలిసిపోతాం. అతి త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. ఆమె నా చెల్లెలి స్నేహితురాలు. తను ఐటీలో ఉద్యోగం చేస్తుంది. రెండుసార్లు చూసినప్పుడు మా అమ్మ ఫేస్‌కట్ ఉందనిపించింది. వెంటనే ప్రపోజ్ చేశాను అని అన్నాడు.
mahesh vitta marriage in september
ఆమె పరిచయమవగానే ప్రపోజ్ ఏంటి? పో అంది. సరే ఫ్రెండ్స్‌గా ఉందామన్నాను. రెండేళ్ల తర్వాత ప్రేమకు ఓకే చెప్పింది. గతేడాది మా ఇద్దరి ఇంట్లో చెప్పాము, ఒప్పుకున్నారు. నా సినిమా రిలీజయ్యాక ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో వివాహం చేసుకుంటాను’ అని చెప్పుకొచ్చాడు మహేశ్ విట్టా. బిగ్‌బాస్ ఓటీటీ గురించి మాట్లాడుతూ.. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టే వస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఓటీటీ గేమ్‌లో మహేష్ విట్టా స్లో అండ్ స్టడీగా గేమ్ ఆడుతున్నాడు.
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.