
Makers who say when KGF 3 will start
KGF 3 : సౌత్‌లో బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాల తర్వాత దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులని అలరించిన చిత్రం కేజీఎఫ్. యష్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు కేజీఎఫ్‌కి సీక్వెల్‌గా కేజీఎఫ్ 2 తెరకెక్కగా, ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేసింది.దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులని తెగ అలరించింది. ఈ సినిమా ఎండింగ్‌లో చాప్టర్ 3 కూడా వుందని దర్శకుడు హింట్ ఇచ్చారు.పార్ట్-3 బుక్‌ని ఓ టీవీ ఛానల్ అసిస్టెంట్ గుర్తించడం.. సముద్రంలో షిప్‌తో సహ రాఖీ మునిగిపోవడంతో సినిమాకు ఎండ్ కార్డ్ వేసిన ప్రశాంత్ నీల్ అతన్ని వెతుక్కుంటూ ప్రధాని రమీకా సేన్‌కు యుఎస్ అధికారులు ఇండోనేషియా అధికారులు ప్రత్యేకంగా ఓ ఫైల్‌ని అందించడంతో పార్ట్-2 సినిమా ముగిసింది.
అంటే పార్ట్-3ని యుఎస్ ఇండోనేషియా నేపథ్యంలో సాగిస్తారా? అనే అనుమానాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మూడో భాగాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభించబోతున్నామంటూ నిర్మాత విజరు కిరగందూర్ తాజాగా ప్రకటించారు.ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ..ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ మూవీ ఇప్పటికే 35 శాతం షూట్ కంప్లీట్ చేసుకుందని..నవంబర్ లోపు ఈ సినిమా పూర్తవుతుందని వెల్లడించారు. ఆ తర్వాత కేజీఎఫ్-3 షూట్ మొదలుపెట్టి..2024లో రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నామని చెప్పారు.
Makers who say when KGF 3 will start
మార్వెల్ సిరీస్ లాగా ఓ సరికొత్త రకమైన విశ్వాన్ని సృష్టించబోతున్నామని విజయ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే కెజియఫ్ ఫస్ట్ పార్ట్ మూవీ సూపర్ సక్సెస్ సాధిస్తే.. చాప్టర్ 2 మూవీ మాత్రం .. అంతకు మించి అన్నట్టు దూసుకుపోతోంది. బాక్సాఫీస్ సంచలనంగా మారింది.తొలి రోజునే ఈ సినిమా రికార్డుస్థాయి వసూళ్లతో ఆశ్చర్యపరిచింది. ఆ తరువాత వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడానికి ఈ సినిమా ఎక్కువ టైమ్ తీసుకోలేదు. ఇక బాలీవుడ్ లోను ఈ సినిమా వసూళ్లు చూసి అంతా షాక్ అయ్యారు. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని అటు ప్రశాంత్ నీల్ .. ఇటు యశ్ ఇద్దరూ కూడా క్లారిటీ ఇచ్చేశారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.