Home » Entertainment » Mallema And Etv Is Doing Injustice To Jabardasth Nookaraju And Emmanuel
Entertainment

Jabardasth : జబర్దస్త్‌ నూకరాజ్, ఇమాన్యూల్‌ లకు మల్లెమాల తీవ్రమైన అన్యాయం చేస్తోంది!

Authored By
aruna
The Telugu News | Updated on: September 11, 2022 6:28 pm
Advertisement

Jabardasth : ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో లో ఇమాన్యుల్ మరియు నూకరాజు చాలా కాలంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ తమ కామెడీతో మంచి మార్కులు దక్కించుకున్నారు. ఇద్దరు కూడా సమయస్ఫూర్తితో పంచ్ లు వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. గతంలో ఒక కమెడియన్ మంచి గుర్తింపు దక్కించుకుంటే వెంటనే వారికి టీం లీడర్ పదవి ఇచ్చి గౌరవించేవారు. కానీ ఇప్పుడు అలాంటి పద్ధతి కనిపించడం లేదు. హైపర్ ఆది చాలా తక్కువ సమయంలోనే టీం లీడర్ గా ఎదిగిన విషయం తెలిసిందే.

Advertisement

సుడిగాలి సుదీర్ ఇంకా చాలా మందికి కూడా మల్లెమాల వారు చాలా తక్కువ సమయంలోనే టీం లీడర్ పదవి కట్టబెట్టారు. కానీ ఇమాన్యుల్ మరియు నూకరాజు ఎంత కష్టపడ్డా కూడా ఫలితం దక్కడం లేదు. వీరిద్దరూ చాలా కష్టపడి కామెడీ చేస్తున్న కూడా మల్లెమాల ఈటీవీ వారు పట్టించుకోవడం లేదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరూ శ్రీదేవి డ్రామా కంపెనీ మరియు జబర్దస్త్ కార్యక్రమాలను తమ భుజాలపై మోస్తున్నారు.

Mallema and ETV is doing injustice to Jabardasth Nookaraju and Emmanuel

Advertisement

అయినా వీరికి మల్లెమాల తీవ్రమైన అన్యాయం చేస్తుందంటూ వారి యొక్క అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరూ వేరే ఛానల్ నుండి పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చినా కూడా పట్టించుకోకుండా ఈటీవీ లోనే కొనసాగుతున్నారంటూ టాక్‌ వినిపిస్తుంది. ఈ విషయంలో ఇమాన్యుల్ మరియు నూకరాజు లు స్పందిస్తూ.. తమకు టీం లీడర్ పదవులు అక్కర్లేదు.. కేవలం మంచి పేరు చాలు అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరికీ ఫ్యూచర్ లో మంచి భవిష్యత్తు ఉంటుంది అంటూ బుల్లి తెర వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి