Maanas Nagulapalli : పెళ్లై ఏడాది కాలేదు అప్పుడే గుడ్ న్యూస్.. బిగ్ బాస్ మాన‌స్ చాలా స్పీడు మీదున్నాడే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Maanas Nagulapalli : పెళ్లై ఏడాది కాలేదు అప్పుడే గుడ్ న్యూస్.. బిగ్ బాస్ మాన‌స్ చాలా స్పీడు మీదున్నాడే..!

 Authored By ramu | The Telugu News | Updated on :5 July 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Maanas Nagulapalli : పెళ్లై ఏడాది కాలేదు అప్పుడే గుడ్ న్యూస్.. బిగ్ బాస్ మాన‌స్ చాలా స్పీడు మీదున్నాడే..!

Manas Nagulapalli : బుల్లితెర మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు మాన‌స్. బిగ్ బాస్ షోతో మనోడికి చాలా ఫేమ్ వ‌చ్చింది. షోలో ట్రాన్స్‌జెండ‌ర్ ప్రియాంక‌తో క‌లిసి తెగ సంద‌డి చేశాడు. ఇక షో నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక ప‌లు షోస్ చేశాడు. ఇప్పుడు బ్ర‌హ్మ ముడి అనే సీరియ‌ల్ చేస్తున్నాడు. అయితే 2023 నవంబర్ 22న మానస్, శ్రీజల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వారి పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైర‌ల్ కాగా, చాలా మంది సెల‌బ్స్ వారికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అయితే ఈ మ‌ధ్యే పెళ్లి పీటలు ఎక్కిన మానస్‌ అప్పుడే తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా మానసే ప్రకటించాడు.

Maanas Nagulapalli గుడ్ న్యూస్..

త‌న ఇన్‌స్టాలో ఓ పోస్ట్ షేర్ చేస్తూ.. తన భార్య శ్రీజ బేబీ బంప్‌ ఫోటోలు షేర్ చేసాడు. వాటికి కామెంట్‌గా. “అరెంజ్డ్‌ లవ్‌. మాది పెద్దలు కుదిర్చిన వివాహమైన మా మనసులు కలిశాయి. ఇప్పుడు మా కుటుంబంలోకి ఓ బుజ్జాయి రాబోతుంది. మా జీవితాల్లో త్వరలో బేబీ నాగులపల్లి రాబోతోంది” అంటూ మానస్‌ తన పోస్ట్‌కు రాసుకొచ్చాడు. ప్రస్తుతం మానస్‌ పోస్ట్‌ వైరల్‌ అవుతుంది. దీంతో ఈ బుల్లితెర హీరోకు సహానటీనటులు, ఫ్యాన్స్‌ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అంతేకాదు తన భార్య శ్రీజకు సీమంతం జరిగినట్టు కూడా వెల్లడించాడు. వారం కిందటే తన శ్రీజకు ఘనంగా సీమంతం కూడా నిర్వహించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి.

Maanas Nagulapalli పెళ్లై ఏడాది కాలేదు అప్పుడే గుడ్ న్యూస్ బిగ్ బాస్ మాన‌స్ చాలా స్పీడు మీదున్నాడే

Maanas Nagulapalli : పెళ్లై ఏడాది కాలేదు అప్పుడే గుడ్ న్యూస్.. బిగ్ బాస్ మాన‌స్ చాలా స్పీడు మీదున్నాడే..!

మానస్ నాగులపల్లి నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. మానస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలైంది. 2011లో ఝలక్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. గ్రీన్ సిగ్నల్, కాయ్ రాజా కాయ్, ప్రేమికుడు, గోలీ సోడా.. ఇలా పలు చిన్న చిత్రాల్లో హీరోగా నటించాడు. అవేమీ గుర్తింపు తీసుకురాలేదు. 2021లో ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు 5లో మానస్ కంటెస్ట్ చేశాడు. బిగ్ బాస్ షో మానస్ కి మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. స్ట్రాంగ్ ప్లేయర్ గా ఫైనల్ కి వెళ్ళాడు. టాప్ 5లో నిలిచాడు. త‌న ఆట‌లు, పాట‌లు, డ్యాన్స్‌ల‌తో అశేష ఆద‌ర‌ణ అయితే ద‌క్కించుకున్నాడు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది