Manchu Lakshmi : “చమ్కీల అంగీలేసి ఓ వదిన” సాంగ్ కీ మంచు లక్ష్మి డాన్స్ ఇరగదీసింది.. వీడియో వైరల్!!
Manchu Lakshmi : శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు తీసిన సినిమా “దసరా”. నేడు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావటం జరిగింది. నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా తెలంగాణ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కింది. ఢీ గ్లామర్ రోల్స్ లో నాని… కీర్తి సురేష్ ఫస్ట్ టైం కనిపిస్తూ ఉన్నారు. అదే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున జరగడంతో నేడు ఓపెనింగ్స్ భారీ ఎత్తున రావడం జరిగాయట.
Manchu Lakshmi Superb Dance Moves For Chamkeela Angeelesi Song
ఇదిలా ఉంటే ఈ సినిమాలో “చమ్కీల అంగీలేసి ఓ వదిన” అనే సాంగ్ చాలా అద్భుతంగా ప్రేక్షకు ఆదరణ దక్కించుకుంది. యూట్యూబ్ ఇంకా సోషల్ మీడియాలో పలు విభాగాలలో రికార్డు స్థాయి వ్యూస్ రాబట్టింది. తాజాగా ఈ సాంగ్ కీ మంచు లక్ష్మి డాన్స్ వేసింది. పింక్ కలర్ లంగా వోని డ్రెస్ లో.. ట్రెడిషనల్ లుక్ లో మంచు లక్ష్మి వేసిన స్టెప్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఇదే సమయంలో మంచు లక్ష్మి కూతురు కూడా మధ్యలో చిన్న చిన్న స్టెప్పులు వేయడం జరిగింది. కూతురితో కలిసి మంచు లక్ష్మి.. దసరా సినిమాలో “చమ్కీల అంగీలేసి ఓ వదిన” సాంగ్ కి వేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇదే పాటకి హీరోయిన్ కీర్తి సురేష్ తల్లి సైతం తన అల్లుడితో కలిసి స్టెప్పులు వేయడం జరిగింది. ఆ వీడియో కూడా సోషల్ మీడియాని కుదిపేస్తోంది.
