Manchu Manoj : మంచు మనోజ్ ఒకప్పుడు హీరోగా వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరించాడు. కాని వరుస ఫ్లాపులు పలకరిస్తున్న నేపథ్యంలో కాస్త సైలెంట్ అయ్యాడు. ఇటీవల పెళ్లి చేసుకొని త్వరలో తండ్రి కూడా కాబోతున్నాడు. అయితే రీసెంట్‌గా రామ్ చరణ్ బర్త్ డే వేడుకలకి సంబంధించి జరిగిన ఈవెంట్‌లో మెరిసిన మంచు మనోజ్.. చిరు, మోహన్ బాబు గొడవల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. రామ్ చరణ్ నాకు ప్రాణ మిత్రుడు అని చెప్పిన మనోజ్.. ఈ బర్త్ డే ఈవెంట్‌కు ఇలా రావడం ఆనందంగా ఉంది. ప్రతీ ఏడాది అభిమానులు ఎంతో గ్రాండ్‌గా సెలెబ్రేషన్స్ చేస్తారు.. రామ్ చరణ్ చిన్నప్పటి స్నేహితులతో ఇప్పటికీ అంతే ఆప్యాయంగా ఉన్నారు ..అందరూ స్థాయి పెరిగాక కొత్త స్నేహాలతో బిజీగా ఉంటారు.. పాత వారిని మరిచిపోతారు.. కానీ రామ్ చరణ్ మాత్రం ఇంకా తన చిన్న నాటి స్నేహితులతో ఆప్యాయంగా ఉంటున్నాడు.
రామ్ చరణ్ ఎన్నో సాయాలు చేస్తుంటారు. ఎవరు ఏ కష్టాల్లో ఉన్నా కూడా సాయం చేస్తుంటాడు.. అదే రామ్ చరణ్ గ్రేట్ నెస్ అని మనోజ్ అన్నారు. ఓ సారి ఓ కుటుంబం దుబాయ్‌లో చిక్కుకోగా,ఆ కుటుంబానికి నా వంతుగా నేను సాయం చేశాను.. నాకు ఇంకా డబ్బు కావాల్సి వచ్చి అర్ధరాత్రి రామ్ చరణ్‌కు ఫోన్ చేసి ఐదు లక్షలు అడిగాను.. బాబాయ్ ఇలా ఓ ఆడబిడ్డకు కష్టం ఉందని చెప్పిన వెంటనే ఐదు లక్షలు కొట్టేశాడు.. అదీ రామ్ చరణ్ గొప్పదనం.ఇక ఇదే ఈవెంట్‌లో చిరంజీవి, మోహన్ బాబు గొడవల గురించి కూడా మాట్లాడాడు.
ఈవెంట్‌కి వచ్చేముందు కొందరు మిత్రులు నన్ను ఓ ప్రశ్న అడిగారు. మీ నాన్న మోహన్ బాబు గారు.. వాళ్ళ నాన్న చిరంజీవి గారు ఎప్పుడూ గొడవపడుతుంటారు.. మళ్ళీ కలసి పోతుంటారు. కానీ నువ్వు మాత్రం చరణ్ తో స్నేహంగా ఉంటున్నావేంటి అని అడిగారు. భార్యాభర్తల గొడవల్లోకి మధ్యలోకి వెళ్తే ఏం అవుతుంది.. అలానే వారిద్దరి మధ్యలోకి కూడా ఎవరు వెళ్లొద్దు.. వారిద్దరూ కూడా అలాంటి వారే.. టామ్ అండ్ జెర్రీ టైపు.. వాళ్లది 45 ఏళ్ల బంధం.. రిలేషన్ షిప్ బెట్విన్ మంచు ఫ్యామిలీ అండ్ మెగా ఫ్యామిలీ షుడ్ బీ లైక్ ఫిష్ అండ్ వాటర్.. బట్ నాట్ ఫిష్ అండ్ ఫిషర్ మెన్ అని పెద్దరాయుడు మూవీ స్టైల్‌లో డైలాగ్ చెప్పి ముగించాడు మంచు మనోజ్.. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.