KTR : ఫోన్ ట్యాపింగ్ విషయంపై కేటీఆర్ కౌంటర్లు.. ఎంత మాట్లాడితే అంత ప్రమాదమే..!
KTR ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కుదిపేస్తోంది. ఎప్పుడు ఎవరి పేర్లు బయటకు వస్తాయో తెలియక నేతలంతా తలలు పట్టుకుంటున్నారు. ఇందులో మొదటగా ఇరుక్కున్న ప్రణీత్ రావును విచారిస్తున్న పోలీసులకు సంచలన విషయాలు తెలుస్తున్నాయంట. ఆయన ద్వారా సాక్ష్యాలను సేకరించేందుకు మరిన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీస్ అధికారులు అరెస్ట్ అవుతున్నారు. కేవలం అక్కడిగో ఆగిపోవట్లేదు ఈ వ్యవహారం. ఇందులో ఇప్పటికే ఇంటెలిజెన్స్ తెలంగాణ బ్యూర్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పేరు కూడా వచ్చేసింది. పోలీసులు కూడా అరెస్ట్ అయినవారు ఇస్తున్న సమాచారంతో అనేక సాక్ష్యాలను పక్కాగా సేకరిస్తున్నారంట.
ఈ విషయంలో ఎవరినీ వదలొద్దని పై నుంచి ఆర్డర్లు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఎంపీ ఎన్నికల ముంగిట దీన్ని బాగా రోస్ట్ చేసేస్తున్నారు. అరెస్ట్ అయిన అధికారులు ఇస్తున్న సమాచారం ప్రకారం.. ఇలా ట్యాపింగ్ చేసిన ఫోన్ కాల్స్ ను ఓ ఇద్దరు బడా నేతలకు ఇచ్చినట్టు తెలుస్తోంది. బీఆర్ ఎస్ ప్రభుత్వ హాయంలోనే ఈ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది కాబట్టి త్వరలోనే ఆ ఇద్దరు బీఆర్ ఎస్ నేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికి కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు అందరికీ విచిత్రంగా అనిపిస్తున్నాయి. కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయలేదని.. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు రేవంత్ రెడ్డి ఇలాంటి లీకులు ఇస్తూ మీడియా దృష్టిని, ప్రజలదృష్టిని మరల్చుతున్నాడని ఆరోపణలు చేస్తున్నారు.
KTR : ఫోన్ ట్యాపింగ్ విషయంపై కేటీఆర్ కౌంటర్లు.. ఎంత మాట్లాడితే అంత ప్రమాదమే..!
అంతే కాకుండా దోషులు ఎవరైతే వారిని అరెస్ట్ చేయాలంటూ ఆయన చెబుతున్నారు. కానీ కేటీఆర్ ఈ వ్యవహారిన్ని ఎంత గెలికితే అంత ప్రమాదమే అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అటుతిరిగి ఇటు తిరిగి చివరకు బీఆర్ ఎస్ మెడకు చుట్టుకుంటుందని అంటున్నారు. కాబట్టి ఇప్పటికే డ్యామేజ్ అవుతున్న పార్టీ ఇమేజ్.. ఈ వ్యవహారంతో మరింత డ్యామేజ్ కావడం ఖాయం అంటున్నారు. అందుకే కేటీఆర్ ఈ విషయాన్ని ఎంత పక్కన పెడితే అంత బెటర్ అంటున్నారు.
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
Andhra Pradesh : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాయిటర్స్…
This website uses cookies.