Manchu Manoj – Mounika Reddy : బాబోయ్‌.. మంచు మనోజ్‌ పెళ్లి చేసుకున్న మౌనిక రెడ్డి ఆస్తులు అంతగా ఉన్నాయా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Manchu Manoj – Mounika Reddy : బాబోయ్‌.. మంచు మనోజ్‌ పెళ్లి చేసుకున్న మౌనిక రెడ్డి ఆస్తులు అంతగా ఉన్నాయా?

 Authored By prabhas | The Telugu News | Updated on :9 March 2023,6:40 pm

Manchu Manoj – Mounika Reddy ; మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి ల వివాహం వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన వివాహ వేడుక కొత్త దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడంతో ముగిసింది. మనోజ్ మరియు మౌనిక రెడ్డి దంపతులకు లక్షలాది మంది అభిమానులు ఆశీర్వాదాలు అందించారు. సినిమా కుటుంబానికి చెందిన మంచు మనోజ్ రాజకీయ కుటుంబానికి చెందిన భూమా మౌనిక రెడ్డి మధ్య ప్రేమ ఎలా చిగురించింది, ఇద్దరికీ అసలు ఎలా పరిచయం అయింది అంటూ చాలా మంది సోషల్ మీడియాలో వెతికే ప్రయత్నం చేస్తున్నారు.

Manchu Manoj Wife Mounika Reddy assets interesting news

Manchu Manoj Wife Mounika Reddy assets interesting news

చాలా సంవత్సరాలుగా మంచు మరియు భూమ ఫ్యామిలీ మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఆ సంబంధాల కారణంగానే భూమా మౌనిక తో మంచు మనోజ్ కి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ఇటీవల ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి మనోజ్, మౌనిక రెడ్డి పెళ్లి చేసుకున్నారు. ఈ సమయంలో భూమా మౌనిక రెడ్డి యొక్క ఆస్తుల గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. మౌనిక రెడ్డి యొక్క తల్లి తండ్రి రాజకీయాల్లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వచ్చారు. అలాగే సోదరి అఖిల ప్రియ మంత్రిగా చేశారు. కనుక ఆస్తులు సంపాదన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది.

Manchu Manoj and Bhuma Mounika Reddy Marriage Visuals | Mohan Babu | YS  Vijayamma | Manastars - YouTube

మంచు మనోజ్ ఆస్తులతో పోలిస్తే భూమా మౌనిక రెడ్డి యొక్క ఆస్తులు చాలా రెట్లు ఎక్కువ అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆ విషయమై ఇప్పటి వరకు అలాంటి అధికారిక క్లారిటీ లేదు, కానీ రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చింది కనుక భూమా మౌనిక రెడ్డి ఆస్తి విషయంలో కాస్త ముందు ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. మంచు మనోజ్ కూడా తిరుపతితో పాటు పలు ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయి. వ్యాపారాలు కూడా చేస్తున్న మంచు మనోజ్ ఇప్పుడు భూమా మౌనిక ఆస్తులు కూడా కలవడంతో ఇండస్ట్రీలో టాప్ ఆస్తిపరుల జాబితాలో చేరే అవకాశం ఉంది.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది