Manchu Mohan Babu big decision about Manchu Manoj
Manchu Mohan Babu : మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ మొదట ప్రణతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ళకి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఆమెకు విడాకులు ఇచ్చి దూరంగా ఉంటున్నాడు. ఇక సినిమాల పరంగా కూడా సక్సెస్ లేక మనోజ్ ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే భూమా మౌనిక రెడ్డి తో పరిచయం ఏర్పడింది .అది కాస్త ప్రేమగా మారి పెళ్లిదాకా వెళ్ళింది. భూమా మౌనిక పొలిటికల్ ఫ్యామిలీకి చెందినది. దివంగత నేత భూమా నాగిరెడ్డి శోభా రెడ్డి దంపతుల కుమార్తె ఈ భూమా మౌనిక రెడ్డి. ఈమె అక్క అఖిల ప్రియ కూడా గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
Manchu Mohan Babu big decision about Manchu Manoj
ప్రస్తుతం వీరు టిడిపి పార్టీలో ఉన్నారు. అయితే ఇటీవల మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఇక మనోజ్ మౌనిక రెడ్డి పెళ్లి అంగరంగ వైభవంగా అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. అయితే వీరి పెళ్లికి మోహన్ బాబు రావడం లేదని పుకార్లు బయటికి వచ్చాయి. వీరి పెళ్లి ఇష్టం లేని మోహన్ బాబు, విష్ణు మనోజ్ పెళ్లికి రావడం లేదని వార్తలు వినిపించాయి. అయితే పెళ్లికి సంబంధించిన ఫోటోలు బయటికి రావడంతో ఆ వార్తలకు చెక్ పడినట్లు అయింది. అయితే మొదటగా అన్ని ఫోటోలలో అక్క మంచు లక్ష్మి ప్రసన్న మాత్రమే కనిపించింది.
ఎక్కడ మంచు మోహన్ బాబు ఆయన సతీమణి కనిపించలేదు. అలాగే మంచు విష్ణు ఆయన సతీమణి కూడా కనబడకపోవడంతో అందరూ ఆ పుకార్లు నిజమే అనుకున్నారు. కానీ పెళ్లయిన మరుసటి రోజు మంచు మోహన్ బాబు ఫోటోలు బయటకి వచ్చాయి. ముందు రోజు విడుదల చేసిన ఫోటోలలో కనిపించని మోహన్ బాబు తర్వాత రోజు ఫోటోల్లో కనిపించారు. తన సతీమణి నిర్మల తో కలిసి పెళ్లి మండపం ఎక్కారు. కొత్తజంటను ఆశీర్వదించారు. మోహన్ బాబుని పట్టుకొని మౌనిక ఎమోషనల్ అయిన ఫోటోలు కూడా బయటికి వచ్చాయి. అలాగే మంచి విష్ణు భార్య పిల్లలతో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటికి వచ్చాయి.
Cardamom Milk : రాత్రి పడుకునే ముందు పాలు తాగితే ఆరోగ్యమని మనందరికీ తెలుసు. పాలలో కొన్ని పదార్థాలు కలిపి…
Salt In Healthy Foods : ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఉప్పు లేనిదే తినం. ఉప్పు ఆహారంలో ప్రధానమైన భాగం.…
Apply Oil Benefits Of Belly : వైద్యశాస్త్రం ప్రకారం మానవ శరీరంలో ఏడు ప్రధాన బిందువులలో ఒకటిగా పేర్కొనబడిందే…
Redmi A5 : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అయిన షియోమీ తాజాగా భారత మార్కెట్‌లో బడ్జెట్ ఫోన్ Redmi A5ను…
AP 10th Class Results : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా…
Capsicum : క్యాప్సికం ప్రియులకు చేదు కబురు. క్యాప్సికం తినేవారు తప్పక ఈ విషయాలు తీసుకోవాల్సిందే... సుఖం తినడం వల్ల…
New Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజల కోసం మరో సంక్షేమ నిర్ణయం తీసుకుంది. కొత్తగా అర్హులైన వారికి…
Numerology : పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి జాతకం, అబ్బాయి జాతకం రెండు కలిస్తేనే వారి జీవితం బాగుంటుంది అని జ్యోతిష్యులు…
This website uses cookies.