Home » Entertainment » Manchu Mohan Babu Not Attend Manoj Marriage
Entertainment

Manchu Mohan Babu : బ్రేకింగ్.. మంచు మనోజ్ పెళ్లి కి మోహన్ బాబు రావడం లేదు ? మొహం మీదే ఛీ కొట్టాడు !

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: March 3, 2023 12:15 pm
Advertisement

Manchu Mohan Babu : మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఈనెల 3న మనోజ్ పెళ్లి జరగనుంది. భూమా మౌనికతో అత్యంత సన్నిహితుల మధ్య వివాహం జరగనుందని సమాచారం. అయితే మనోజ్ పెళ్లికి మోహన్ బాబు ,విష్ణు రావట్లేదని సమాచారం. మనోజ్ భూమా మౌనిక ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని వీరిద్దరూ పెళ్ళికి రాకూడదని డిసైడ్ అయ్యారట. మొదటినుంచి మోహన్ బాబు మనోజ్ పెళ్లి విషయంలో అసహనంగా ఉన్నారట. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయట. భూమా మౌనిక దివంగత నేత భూమా నాగిరెడ్డి కూతురు. తల్లి శోభా నాగిరెడ్డి కూడా మృతిచెందారు.

Advertisement

Manchu Mohan Babu not attend Manoj marriage

ప్రస్తుతం ఈ ఫ్యామిలీ టిడిపిలో ఉన్నారు. అక్క అఖిలప్రియ గత ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. అయితే మౌనిక పొలిటికల్ ఫ్యామిలీకి చెందినది కావడంతో మోహన్ బాబు అంగీకారం తెలపలేదట. అలాగే ఆమెకు ఇది రెండవ వివాహం. మొదటి భర్తతో విడాకులు అయ్యాయి. ఈ కారణాలతో మోహన్ బాబు ఈ పెళ్లిని వ్యతిరేకించారని తెలుస్తుంది. అయితే మనోజ్ మాత్రం మనసు మార్చుకునేది లేదని తేల్చి చెప్పేసారట. మనోజ్ మోహన్ బాబు మధ్య గొడవ జరిగి ఆస్తి పంపకాల వరకు వెళ్లిందట. అందుకే మనోజ్ హైదరాబాదులో ఉండడం లేదని టాక్. అలాగే అన్నయ్య విష్ణు కూడా మనోజ్ పెళ్లికి ఆగ్రహంగా ఉన్నారట.

Advertisement

తాజా సమాచారం ప్రకారం మనోజ్ పెళ్ళికి మోహన్ బాబు రావట్లేదని సమాచారం. దీంతో విష్ణు కూడా పెళ్లికి రాకూడదని డిసైడ్ అయ్యారట. అక్క మంచు లక్ష్మి తమ్ముడికి అండగా నిలిచి పెళ్లి పెద్దగా వ్యవహరిస్తున్నారట. కుటుంబం మొత్తం దూరం పెట్టిన మంచు లక్ష్మి తన తమ్ముడి వివాహాన్ని జరిపిస్తుందట. ఇక పోతే మంచు మనోజ్ 2015లో ప్రణతి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లకు వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి 2019లో విడాకులు తీసుకొని దూరమయ్యారు. అప్పటినుంచి ఆయన ఒంటరిగా ఉంటున్నారు. ఇటు సినిమాల పరంగా కూడా సక్సెస్ లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇక ఇటీవల ఓ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి