manchu vishnu comments on chiranjeevi and ys jagan meeting
Manchu Vishnu : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు మరో సారి వివాదాస్పదమయ్యాయి ఆయన తాజాగా మా సభ్యులతో భేటీ అయ్యారు. వంద రోజుల పదవీ కాలం పూర్తి చేసుకున్న కొత్త మా సంఘం కార్యాచరణ నిమిత్తం భేటీ అవ్వడం జరిగిందట. ఈ సందర్భంగా పలు విషయాలను చర్చించినట్లుగా సమాచారం అందుతోంది. భేటీ ముగిసిన తర్వాత మంచు విష్ణు మీడియా తో మాట్లాడాడు. ఆ సందర్భంగా పలు విషయాలను ప్రస్తావించారు. టికెట్ల రేట్ల గురించి సీఎం జగన్ తో మాట్లాడవచ్చు కదా అంటూ ప్రశ్నించిన మీడియాకు ఆయన వింత సమాధానం ఇచ్చాడు.ఏపీ లో టికెట్ల విషయమై మాట్లాడేందుకు నేను నిర్మాతల మండలి అధ్యక్షుడిని కాదు.. నేను మా అధ్యక్షుడిని అన్నాడు. టికెట్ల రేట్ల విషయం తెలుగు సినిమా మండలి చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి అమరావతి వెళ్లి సీఎం జగన్ మోహన్ రెడ్డి తో టికెట్ల రేట్ల విషయంలో చర్చలు జరిపిన విషయం తెల్సిందే. ఆ విషయమై మంచు విష్ణు స్పందించాడు. చిరంజీవి గారు వెళ్లి సీఎం జగన్మోహన్ కలవడం అనేది సినిమా పరిశ్రమకు సంబంధించిన విషయం కాదని విష్ణు తేల్చి చెప్పాడు. అది వారి వ్యక్తిగత బేటీ మాత్రమే అవుతుందని సినిమా పరిశ్రమ వారితో సంబంధం లేకుండా చిరంజీవి వెళ్లి జగన్ తో భేటీ అయితే అది సినిమా పరిశ్రమ కు సంబంధించిన ఎలా అవుతుంది.. దాని గురించి నేను ఎలా స్పందిస్తాను అన్నాడు.చిరంజీవి స్పష్టంగా తాను సినిమా పరిశ్రమ తరఫున వచ్చానని.. జగన్ ను టికెట్ల రేట్లు పెంపు విషయమై కోరినట్లుగా చెప్పాడు. అయినా కూడా ఇప్పుడు మంచు విష్ణు మాట్లాడుతూ చిరంజీవి భేటీకి ఇండస్ట్రీ సంబంధం ఏంటి అన్నట్లుగా చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో దుమారాన్ని రేపుతున్నాయి.
manchu vishnu comments on chiranjeevi and ys jagan meeting
చిరంజీవి తన స్థాయిని తగ్గించుకుని మరి ఇండస్ట్రీ కోసం సీఎం జగన్ తో భేటీ అయిన చర్చలు జరుగుతుంటే మంచు విష్ణు ఇలా మాట్లాడటం ఏమైనా బాగుందా అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి ఏం చేసినా కూడా ఇండస్ట్రీ కోసమే చేస్తారు. ఆ విషయం అందరికీ తెలుసు. టికెట్ల రేట్ల పెరుగుదల క్రెడిట్ మెగాస్టార్ చిరంజీవికి దక్కకూడదనే ఉద్దేశంతో మంచు ఫ్యామిలీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి ఇలాంటి వ్యాఖ్యలు పట్టించుకోకుండా మరో సారి ఈనెల పదో తారీఖున సీఎం జగన్ ను కలవనున్నారు. కచ్చితంగా ఆ సమయంలో టికెట్ల రేట్లు పెంపు విషయం లో ఒక క్లారిటీ వస్తుందని ఆశిస్తున్నారు. మంచు విష్ణు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చిరంజీవి చేస్తున్న మంచిని అర్థం చేసుకోవాలంటూ నెటిజన్స్ మంచు విష్ణును కోరుతున్నారు.
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్లోని కొత్తవాడలో ఇన్స్టాగ్రామ్లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
This website uses cookies.