Manchu Vishnu : కన్నప్ప కు నెగిటివ్ ప్రచారం చేస్తే అంతే సంగతి..!
ప్రధానాంశాలు:
రిలీజ్ కానేలేదు అప్పుడే వార్నింగ్ ఇచ్చిన మంచు విష్ణు టీం
Manchu Vishnu : కన్నప్ప కు నెగిటివ్ ప్రచారం చేస్తే అంతే సంగతి..!
Manchu Vishnu : టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం కన్నప్ప (Kannappa) విడుదలకు ముందు వివాదాల్లో చిక్కుకుంది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఇన్టెన్షనల్ నెగటివ్ ప్రచారం జరుగుతున్నట్టు భావించిన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఇందులో తప్పుడు ఉద్దేశాలతో రూమర్లు, కావాలని నెగిటివ్ కామెంట్లు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు అని నిర్మాతలు స్పష్టంగా హెచ్చరించారు.

Manchu Vishnu : కన్నప్ప కు నెగిటివ్ ప్రచారం చేస్తే అంతే సంగతి..!
Manchu Vishnu : మంచు విష్ణు ముందే నెగిటివ్ ప్రచారం వస్తుందని గ్రహించాడా..? అందుకే ఇలా చేశాడా..?
కన్నప్ప చిత్రం అన్ని లీగల్ క్లియరెన్సులు, సర్టిఫికేషన్లతో చట్టబద్ధంగా నిర్మించబడిందని నిర్మాతలు తెలిపారు. ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత మాత్రమే స్పందించాలని, ముందే అభిప్రాయాలు పెట్టి విమర్శించకూడదని కోరారు. కేవలం వ్యక్తిగత విమర్శలు, ప్రకటనల ఉద్దేశంతో విమర్శలు చేస్తే మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తామని, ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే మోహన్ బాబు, విష్ణు విషయంలో వారి ప్రైవసీ హక్కులను గౌరవించేలా తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు.
కన్నప్ప సినిమాను అనుమతుల్లేకుండా స్ట్రీమ్ చేయడం, ప్రదర్శించడం, లేదా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయడంపై సివిల్, క్రిమినల్, సైబర్ చట్టాల ప్రకారం చర్యలు తప్పవని నిర్మాతలు హెచ్చరించారు. సినిమా విడుదలకు ముందు ఇటువంటి నెగిటివ్ క్యాంపెయిన్లకు తాము భయపడబోమని, ప్రేక్షకుల ప్రేమతో సినిమా పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకంగా ఉన్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అధికారిక ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, జూన్ 27న ఈ చిత్రానికి ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాల్సిందే.