Prabhas : ప్రభాస్ – అనుష్క ఒకే సైజ్ కటౌట్..అందుకే మారుతి ప్లాన్ చేశాడు..?

Authored By vamana sai | The Telugu News | Published on: May 17, 2022, 12:00 pm

Prabhas : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గ్లోబల్ స్టార్ ప్రభాస్ కటౌట్ గురించి అందరికీ తెలిసిందే. కొరటాల శివ ప్రభాస్ కోసమే రాసిన డైలాగ్ మాదిరిగా ఆయన కటౌట్‌ను చూస్తే కొన్ని కొన్ని నమ్మేయాల్సిందే. అందుకే, ఆయన పక్కన కూడా అదే రేంజ్ కటౌట్ ఉన్న హీరోయిన్స్ ఉంటే బావుంటుందని అభిమానులు కోరుకుంటుంటారు. ఇక మన టాలీవుడ్‌లో ప్రభాస్‌కు సూటయ్యే కటౌట్..అందరూ సిల్వర్ స్క్రీన్ మీద చూసేందుకు ఆసక్తి చూపించే హీరోయిన్ అనుష్క శెట్టి. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో బిల్లా, మిర్చి, బాహుబలి సిరీస్ వచ్చాయి.

ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించాయి. ఇక ఇండస్ట్రీలో వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ గురించి అందరికీ తెలిసిందే. మంచి ఫ్రెండ్స్ కూడా. ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రభాస్ – అనుష్కలకు పెళ్లి కూడా చేసేశారు. వీటన్నిటినీ పట్టించుకోకుండా ఎవరి పని వారు చేసుకుంటూ వెళుతున్నారు. అయితే, గతకొంత కాలంగా ప్రభాస్ కమిటయిన సినిమాలలో అనుష్క లేకపోవడం డార్లింగ్ ఫ్యాన్స్‌ను కొంత బాధించిందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఇటీవల వస్తున్న ఓ వార్త మాత్రం కాస్త ఊరట కలిగిస్తోంది. అదేమిటంటే, మరోసారి అభిమానులందరూ ఆశించినట్టుగా ప్రభాస్ – అనుష్క కలిసి స్క్రీన్ మీద సందడి చేయనున్నారట.

Maruti Plan in Prabhas Anushka single size cutout

Maruti Plan in Prabhas Anushka single size cutout

Prabhas : డార్లింగ్ ఫాన్స్ ఎంతో ఆశపడుతున్నారు.

ఈ మూవీ మారుతి స్టయిల్ ఆఫ్ కామెడితో ఉంటుందని సమాచారం. ఇక తాజాగా ఈ సినిమాపై ఫిల్మ్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ ప్రకారం.. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిబోతుండగా, ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. వారిలో ఒకరు అనుష్క శెట్టి అని..ఆమెతో ఇప్పటికే మారుతీ చర్చలు కూడా జరిపాడని అంటున్నారు. మిగిలిన ఇద్దరు హీరోయిన్స్ కోసం మేకర్స్ పలువురు యంగ్ బ్యూటీస్ పేర్లను పరిశీలిస్తున్నారట. ప్రభాస్-అనుష్కల కలిసి నటిస్తే చూడాలని డార్లింగ్ ఫాన్స్ ఎంతో ఆశపడుతున్నారు. అందుకే, మారుతీ ఈ కాంబినేషన్ సెట్ చేసి సినిమాకు హైప్ తీసుకొచ్చేందుకు తెగ ట్రై చేస్తున్నాడట. అయితే.. ఈ సినిమా మొదలయ్యేది ఎప్పుడో ఇంకా ఫుల్ క్లారిటీ మాత్రం లేదు.

vamana sai

No bio available for this author.

  1. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  2. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  3. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  4. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  5. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  6. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  7. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp