Home » Entertainment » Mass Hero Missed Bimbisara Movie For Flop Movie
Entertainment

Bimbisara Movie : ప్లాప్ సినిమా కోసం ‘బింబిసార’ను మిస్ చేసుకున్న మాస్ హీరో..!

Authored By
aruna
The Telugu News | Published on: August 10, 2022, 1:00 pm
Advertisement

Bimbisara Movie : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హిట్, ఫ్లాప్ అనే సైకిల్ ఎప్పుడూ రిపీట్ అవుతూనే ఉంటుంది.ఇదేం కొత్త విషయం కాదు. ఎప్పటినుంచో కొనసాగుతుంది కదా అని కొందరికీ అనుమానం కలుగొచ్చు.వాస్తవానికి సినిమా అనేది కూడా లక్కు మీద ఆధారపడి ఉంటుంది. హిట్ అవుతుందనుకున్న సినిమాలు ప్లాప్ అవుతుంటాయి. ప్లాప్ అవుతాయని అనుకుంటే హిట్ అవుతుంటాయి.ఈ ఆలోచనే హీరోలకు చేతిదాకా వచ్చిన అదృష్టాన్ని దూరం చేస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే బింబిసారా మూవీతో రిపీట్ అయ్యింది. ముందు తన వద్దకు వచ్చిన ప్రాజెక్టును టాలీవుడ్ మాస్ హీరో ఒకరు రిజక్ట్ చేయడంతో ఆ కథ కాస్త కళ్యాణ్ రామ్ దగ్గరకు వెళ్లిందని టాక్.

Advertisement

ఆగ‌స్టు 5న ఎన్నో అంచ‌నాల మ‌ధ్య విడుదలైన బింబిసార మూవీ పబ్లిక్‌లో సూప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.బింబిసార చక్రవర్తి చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమాలో కేథ‌రిన్ థెరిసా హీరోయిన్ నటించగా.. ప్రస్తుతం సక్సెస్ ఫుల్‌గా మూవీ రన్ అవుతోంది.ఈ చిత్రానికి నూత‌న దర్శ‌కుడు మ‌ల్లిడి వ‌శిష్ఠ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా విడుదల ముందు వచ్చిన పోస్టర్, ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.కొందరు పోస్టర్ చూసి బాహుబ‌లి, మ‌గ‌ధీర మాదిరిగా ఉన్నాయని కామెంట్ చేశారు.అయితే,సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన క‌ళ్యాణ్ రామ్ మాత్రం ఈ మూవీ పక్కా మంచి విజయాన్ని సాధిస్తుందని ముందు నుంచి నమ్మకంతో ఉన్నారట..అనుకున్నట్టు గానే సినిమా విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. పలువురు ఇండస్ట్రీ పెద్దల ప్రశంసలు అందుకుంది.

Mass hero missed Bimbisara Movie for flop movie..

Advertisement

కాగా, ఈ సినిమాను ఓ స్టార్ హీరో మిస్ చేసుకున్నాడనే విషయం ఎవరికీ తెలిసి ఉండదు.ద‌ర్శ‌కుడు వ‌శిష్ఠ ఈ సినిమా క‌థ‌ను ముందుగా మాస్ మహారాజ్ ర‌వితేజకు చెప్పార‌ట‌.ఈ స్టోరీ విలువ తెలుసుకోకుండా ర‌వితేజ ఈ సినిమాను రిజక్ట్ చేశాడట.ఇక ర‌వితేజ రీసెంట్‌గా రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చాడు.కానీ అది బాక్సాపీస్ వద్ద బొక్కబోర్లా పడింది. తీరా చూస్తూ బింబిసారా అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ విషయం తెలిసిన వారంతా ర‌వితేజ ఫ్లాప్ సినిమా కోసం సూప‌ర్ హిట్‌ను మిస్ చేసుకున్నాడ‌ని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఒకవైపైతే గతంలో చాలా మంది పెద్ద హీరోలు రిజెక్ట్ చేసిన స్టోరీలు చేసి రవితేజ తన కెరీర్‌లో చాలా హిట్లను పొందిన విషయం తెలిసిందే.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి