Mayor : ప్ర‌తి షో వంద టిక్కెట్లు మాకే కావాలంటూ మేయ‌ర్ లేఖ‌.. షాక్ అవుతున్న థియేట‌ర్ నిర్వాహ‌కులు

Mayor : సినిమా థియేటర్లకు విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి లేఖ రాయడం ఇప్పుడు అంత‌టా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వైసీపీ కార్య‌క‌ర్త‌ల ఒత్తిడి వ‌ల‌న మేయ‌ర్ ఈ లేఖ‌ని రాసిన‌ట్టు తెలుస్తుంది. సినిమా విడుదల సందర్భంగా మెుదటి రోజు ప్రతి షోకు మల్టీప్లెక్స్​ థియేటర్లలో 100 టికెట్లు పంపాలని లేఖలో పేర్కొన్నారు. పార్టీ కార్పొరేటర్లు, నాయకులు సినిమా టికెట్లు అడుగుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. సినిమా టికెట్లను ఛాంబర్​కు పంపాలని, అందుకు అయ్యే డబ్బులు చెల్లిస్తామని లేఖలో రాసుకొచ్చారు. నగరంలోని అన్ని మల్టీప్లెక్స్​ థియేటర్లకూ ఈ లేఖలు పంపారు. ఈ లేఖ చూసిన మల్టీప్లెక్స్ యజమానులు విస్తుపోతున్నారు.

అయితే మల్టీ ప్లెక్స్ స్క్రీన్లలో 200 నుంచి 250 వరకు సీటింగ్ ఉంటుంది. అన్ని షో లకు వంద టిక్కెట్లు మేయర్ కోరిన విధంగా ఇస్తే..తమకు విక్రయించుకోవటానికి ఏమీ మిగలవని వాపోతున్నారు. ఇప్పటి వరకు తమకు అధికారికంగా ఎవరి హాయంలోనూ ఇటువంటి లేఖలు రాలేదని చెబుతున్నారు. ఏపీలో తాజాగా విడుదల చేసిన జీవో ప్రకారం అయిదు షో లకు అనుమతి ఇచ్చారు. అయితే, కొన్ని కండీషన్లను అందులో ప్రస్తావించారు. టిక్కెట్ ధరల పెంపు పైన హీరోలతో పాటుగా దర్శకులు సైతం హర్షం వ్యక్తం చేసారు.ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విడుదలయ్యే ప్రతీ కొత్త సినిమాకు అయిదో షో ప్రదర్శనకు వీలుగా అవకాశం కల్పించాలని నిర్ణయించింది.

mayor writes a letter to theaters

Mayor : మేయ‌ర‌మ్మ ఇదేం లేఖ‌..

దీని ద్వారా ఏ హీరో సినిమా అయినా..అయిదో షో ప్రదర్శనకు థియేటర్లకు వెసులుబాటు కలుగుతోంది. ఇప్పుడు చర్చకు కారణమైన విజయవాడ మేయర్ లేఖల వ్యవహారం పైన ఏ రకంగా స్పందన ఉంటుందనేది చూడాలి.ఏపీలో కొద్ది రోజుల క్రితం వరకు సినీ పరిశ్రమ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్లుగా వ్యవహారం సాగింది. సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించటంతో ప్రభుత్వం పైన ఒత్తిడి..విమర్శలు మొదలయ్యాయి. అయితే, ఆ తరువాత చిరంజీవి నాయకత్వంలని హీరోల టీం నేరుగా సీఎం జగన్ తో చర్చల తరువాత టిక్కెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విష‌యం తెలిసిందే.

Recent Posts

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

55 minutes ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

3 hours ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

3 hours ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

6 hours ago

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

7 hours ago

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

8 hours ago

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

10 hours ago

Money : మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా… వాటిని ఏం చేయాలో తెలుసా…?

Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…

11 hours ago