Mayor : ప్రతి షో వంద టిక్కెట్లు మాకే కావాలంటూ మేయర్ లేఖ.. షాక్ అవుతున్న థియేటర్ నిర్వాహకులు
Mayor : సినిమా థియేటర్లకు విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి లేఖ రాయడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. వైసీపీ కార్యకర్తల ఒత్తిడి వలన మేయర్ ఈ లేఖని రాసినట్టు తెలుస్తుంది. సినిమా విడుదల సందర్భంగా మెుదటి రోజు ప్రతి షోకు మల్టీప్లెక్స్ థియేటర్లలో 100 టికెట్లు పంపాలని లేఖలో పేర్కొన్నారు. పార్టీ కార్పొరేటర్లు, నాయకులు సినిమా టికెట్లు అడుగుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. సినిమా టికెట్లను ఛాంబర్‌కు పంపాలని, అందుకు అయ్యే డబ్బులు చెల్లిస్తామని లేఖలో రాసుకొచ్చారు. నగరంలోని అన్ని మల్టీప్లెక్స్ థియేటర్లకూ ఈ లేఖలు పంపారు. ఈ లేఖ చూసిన మల్టీప్లెక్స్ యజమానులు విస్తుపోతున్నారు.
అయితే మల్టీ ప్లెక్స్ స్క్రీన్లలో 200 నుంచి 250 వరకు సీటింగ్ ఉంటుంది. అన్ని షో లకు వంద టిక్కెట్లు మేయర్ కోరిన విధంగా ఇస్తే..తమకు విక్రయించుకోవటానికి ఏమీ మిగలవని వాపోతున్నారు. ఇప్పటి వరకు తమకు అధికారికంగా ఎవరి హాయంలోనూ ఇటువంటి లేఖలు రాలేదని చెబుతున్నారు. ఏపీలో తాజాగా విడుదల చేసిన జీవో ప్రకారం అయిదు షో లకు అనుమతి ఇచ్చారు. అయితే, కొన్ని కండీషన్లను అందులో ప్రస్తావించారు. టిక్కెట్ ధరల పెంపు పైన హీరోలతో పాటుగా దర్శకులు సైతం హర్షం వ్యక్తం చేసారు.ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విడుదలయ్యే ప్రతీ కొత్త సినిమాకు అయిదో షో ప్రదర్శనకు వీలుగా అవకాశం కల్పించాలని నిర్ణయించింది.
Mayor : మేయరమ్మ ఇదేం లేఖ..
దీని ద్వారా ఏ హీరో సినిమా అయినా..అయిదో షో ప్రదర్శనకు థియేటర్లకు వెసులుబాటు కలుగుతోంది. ఇప్పుడు చర్చకు కారణమైన విజయవాడ మేయర్ లేఖల వ్యవహారం పైన ఏ రకంగా స్పందన ఉంటుందనేది చూడాలి.ఏపీలో కొద్ది రోజుల క్రితం వరకు సినీ పరిశ్రమ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్లుగా వ్యవహారం సాగింది. సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించటంతో ప్రభుత్వం పైన ఒత్తిడి..విమర్శలు మొదలయ్యాయి. అయితే, ఆ తరువాత చిరంజీవి నాయకత్వంలని హీరోల టీం నేరుగా సీఎం జగన్ తో చర్చల తరువాత టిక్కెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.