Actor Hema : హేమ బెంగ‌ళూరు రేవ్ పార్టీకి వెళ్లింది అన‌డానికి బ‌య‌ట‌కి వ‌చ్చిన మ‌రో సాక్ష్యం | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Actor Hema : హేమ బెంగ‌ళూరు రేవ్ పార్టీకి వెళ్లింది అన‌డానికి బ‌య‌ట‌కి వ‌చ్చిన మ‌రో సాక్ష్యం

Actor Hema : బెంగుళూరు శివార్లలో జరిగిన రేవ్ పార్టీ గ‌త కొద్ది రోజులుగా టాలీవుడ్ లో ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుంది. ముఖ్యంగా ఈ పార్టీకి హేమ హాజ‌రైంద‌ని వార్త‌లు రాగా, దానిని ఆమె ఖండించింది. అదే ఫార్మ్ హౌస్ నుండి అక్కడ తాను లేనని ఒక వీడియో చేసి అందరికీ పంపిన విషయం తెలిసిందే. ఆమె వీడియో చూసిన పోలీసులు ఆమె అదే ఫార్మ్ హౌస్ నుండి ఆ వీడియో పంపిందని, ఆమె పార్టీకి హాజరయిన వారిలో […]

 Authored By ramu | The Telugu News | Updated on :24 May 2024,1:00 pm

Actor Hema : బెంగుళూరు శివార్లలో జరిగిన రేవ్ పార్టీ గ‌త కొద్ది రోజులుగా టాలీవుడ్ లో ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుంది. ముఖ్యంగా ఈ పార్టీకి హేమ హాజ‌రైంద‌ని వార్త‌లు రాగా, దానిని ఆమె ఖండించింది. అదే ఫార్మ్ హౌస్ నుండి అక్కడ తాను లేనని ఒక వీడియో చేసి అందరికీ పంపిన విషయం తెలిసిందే. ఆమె వీడియో చూసిన పోలీసులు ఆమె అదే ఫార్మ్ హౌస్ నుండి ఆ వీడియో పంపిందని, ఆమె పార్టీకి హాజరయిన వారిలో ఉందని ఖరారు చేశారు. అంత‌టితో ఆగ‌కుండా హేమ బిర్యానీ తయారు చెయ్యడం గురించి ఇంకో వీడియో పెట్టింది. దీంతో జ‌నాల‌కి కాస్త క‌న్ఫ్యూజ‌న్ ఏర్ప‌డింది. అయితే పోలీసులు పార్టీకి హాజ‌రైన వారంద‌రి ద‌గ్గ‌ర రక్త న‌మూనాలు తీసుకొని టెస్ట్‌ల‌కి పంపారు.

సుద్ద‌పూసేం కాదు..

ఆ రిపోర్ట్స్ వ‌చ్చే లోపు తాను అక్కడ లేనని చెప్పడం కోసం చాలా ప్రయత్నాలు చేసింది హేమ‌. అయితే తాజాగా రిపోర్ట్స్ రాగా, ఆమె మాద‌క ద్ర‌వ్యాలు సేవించిన‌ట్టు ఖ‌రారైంది. అయితే ఆమె అక్క‌డ లేన‌ట్టుగా క్రియేట్ చేసేందుకు చాలానే ప్ర‌యత్నించింది. అక్కడ ఆమె హాజరైన పట్టికలో కృష్ణవేణిగా ఆమె పేరు రాసింది. హేమ అస‌లు పేరు కృష్ణ‌వేణి కావ‌డంతో ఆమె పోలీసుల‌కి కూడా అలానే చెప్పింది. కాని పోలీసుల ముందు ఈమె ప‌ప్పులు ఉడ‌క‌లేదు. రిపోర్ట్స్ పాజిటివ్‌గా రావ‌డంతో ఆమె నోటీసులు అందుకోవాల్సిందే. అయితే ఈమెకి మాదకద్రవ్యం సేవించినందుకు గాను కొన్నిరోజులపాటు కౌన్సెలింగ్ ఇచ్చి పంపవచ్చని స‌మాచారం.

hema

మ‌రోవైపు తాను వెళ్ల‌లేద‌ని అద‌ర‌గొడుతున్న నేప‌థ్యంలో హేమ రేవ్ పార్టీలో పాల్గొంద‌న‌డానికి ప‌లు సాక్ష్యాలు బ‌య‌ట‌కి తీస్తున్నారు. ప్ర‌ముఖ మీడియా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. నటి హేమ మే 18న (శనివారం) రోజున హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లారని తెలిపింది. మధ్యాహ్నం 1.55 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరు వెళ్లిన విమానంలో హేమ ఉన్నారని చెప్పింది. ఇండిగో 6ఈ- 6305 విమానంలో హేమతో పాటు కాంతి, రాజశేఖర్, తదితరులు ఉన్నారని వెల్లడించింది. శనివారం మధ్యాహ్నం 3.15 గంటలకు హేమ బెంగళూరు చేరుకుంది. అక్కడి నుంచి పార్టీ జరిగిన రిసార్ట్‌కు హేమ అండ్ కో వెళ్లి నానా ర‌చ్చ చేసి దొరికిపోయారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది