Meena Stunning post viral in socila media
Meena : సీనియర్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఎన్నో సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న మీనా ఇప్పటికీ సినిమాలతో అలరిస్తూనే ఉంది. మీనా నటించిన చాలా చిత్రాలు ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తూ ఉంటాయి. జీవితం సంతోషంగా సాగుతున్న సమయంలో మీనా ఇటీవల తన భర్త సాగర్ ని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆమె సహా కుటుంబ సభ్యులు తీవ్ర బాధలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో నాటి హీరోయిన్స్‌గా గుర్తింపు సంపాదించుకున్న నటీమణులు రంభ, సంఘవి , సంగీత వారి కుటుంబ సభ్యులతో వెళ్లి మీనాను పరామర్శించారు.
విద్యా సాగర్ మరణించిన ఒక నెల తర్వాత , మీనా ఆమె కుమార్తె నైనిక నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఆమె సన్నిహితులు మరియు ప్రముఖ నటీమణులు సంఘవి, సంగీత, రంభలు కలుసుకున్నారు. నటీమణులు కుటుంబ సమేతంగా వచ్చి మీనాను కలిసి ఫొటోలు దిగారు. తన భర్త మరణానంతరం తొలిసారిగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోను చూసిన అభిమానులు నటి మీనా పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భర్త చనిపోయిన తర్వాత మీనా చేసిన తొలి పోస్ట్ ఇది. ఇప్పుడిప్పుడే మీనా సాధారణ జీవితానికి మీనా అలవాటు పడుతున్నారు.
Meena Stunning post viral in socila media
90వ దశకంలో మీనా సహా రంభ, సంగీత, సంఘవి హీరోయిన్స్‌గా అగ్ర హీరోలందరితో కలిసి ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. మీనా భర్త సాగర్ ఈ ఏడాది జూన్‌లో ఊపిరితిత్తుల సమస్యతో కన్నుమూశారు. ఆ సమయంలో సాగర్ మరణంపై సోషల్ మీడియాలో పలు రకాలైన వార్తలు వినిపించాయి. ఆ సమయంలో మీనాకు సహచర నటీనటులు అండగా నిలిచారు. అలాంటి వార్తలపై మీనా కూడా ఎమోషనల్‌గా స్పందించారు. ఇటీవలే మీనా ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు సినిమా షూటింగ్‌లోనూ పాల్గొంది. ఈ సినిమా సెట్స్‌లో రాజేంద్రప్రసాద్ బర్త్‌డే సెలబ్రేట్ చేయగా ఆ వేడుకల్లో మీనా కనిపించడం అభిమానులకు ఆనందాన్ని ఇచ్చింది.
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
This website uses cookies.