Pushpa 2 : ప్రస్తుతం దేశమంతటా కూడా పుష్ప2 సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ తోపాటు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, యెర్నేని నవీన్, చెరుకూరి మోహన్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా భారీ హిట్ కొడుతుందని అందరు అనుకుంటున్నారు. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 12వేలకు పైగా స్క్రీన్లలో భారీగా విడుదల చేయబోతున్నారు. తమకు నచ్చిన భాషలో చూసుకునేందుకు నిర్మాతలు సినీ డబ్స్ అనే యాప్ ను అందుబాటులోకి తెచ్చారు.
నాలుగోతేదీ రాత్రి 11.00 గంటలకే షోలు వేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. నైజాం, ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాల్లో ఇంకా టికెట్ల బుకింగ్ ప్రారంభం కాలేదు. ఏపీ, తెలంగాణకు కలిపి పుష్ప2 ఎంత వసూలు చేయాల్సి ఉంటుంది? ఎంత వస్తే సినిమా హిట్ అవుతుంది? రాకపోతే ఏమవుతుంది? అనే ప్రశ్నలు ఇప్పుడు ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాను నిర్మాతలు ఆంధ్రలో రూ.90కోట్లకు అమ్మగా, నైజాంలో రూ.100 కోట్లకు అమ్మారు. సీడెడ్ లో రూ.30 కోట్లకు అమ్ముడుపోయింది. ఆ ధరలకు బయ్యర్లు ఇష్టపడి కొనుగోలు చేశారు. 20 శాతం కమిషన్, డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు, థియేటర్ అద్దెలు, 18 శాతం జీఎస్టీ అన్నీ తీస్తే రూ.220 కోట్లు సినిమా వసూలు చేయాల్సి ఉంది. అంటే దాదాపుగా పుష్ప2 ఏపీ, తెలంగాణలో రూ.450 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది
అయితే గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఎఫెక్ట్ మూవీపై తప్పక పడుతుందని అంటున్నారు.పుష్ప 2 కి ఏపీలో బెనిఫిట్ షోస్ ప్లాన్ చేస్తే ఆశ్చర్యకరంగా ఆ షోస్ కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదట. మెగా అభిమానుల సపోర్ట్ లేకపోతే అల్లు అర్జున్ కి బెనిఫిట్ షోస్ పడే సీన్ లేదు అంటూ కామెంట్స్ మొదలయ్యాయి. ఇది ప్రస్తుతం పెద్ద చర్చకే దారి తీయగా ఈ కొత్త కాంట్రవర్సీపై మరో వెర్షన్ వినిపిస్తుంది. కొన్ని చోట్ల మాత్రం మెగా ఫ్యాన్స్ బెనిఫిట్ షోస్ తీసుకుంటే కొన్ని చోట్ల అల్లు అర్జున్ అభిమానులు తీసుకుంటున్నారట. అల్లు అరవింద్ మీద గౌరవంతో చాలా మంది మెగా అభిమానులు తీసుకుంటున్నారని కొందరి నుండి వినిపిస్తున్న టాక్.
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ 13వ వారం రెండు ఎలిమినేషన్స్ జరిగాయి.…
TTD : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్థానిక నివాసితులకు డిసెంబర్ 3 నుంచి ప్రత్యేక దర్శనాన్ని పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది.…
Hair Growth Oil : ప్రస్తుత కాలంలో ఆడ మరియు మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇబ్బంది పడే…
Ysrcp : ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతుంది. ఐతే వైసీపీ కూటమి పాలనను టార్గెట్ చేస్తూ ఎన్నో రకాలుగా…
Carrot Juice : చలికాలంలో ఎక్కువగా ప్రజలు జలుబు మరియు దగ్గు లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాగే శరీరం కూడా…
Turmeric And Ginger : పసుపు మరియు అల్లం ఈ రెండిటికి కూడా ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది అని ప్రత్యేకంగా…
Gold Rate : పండగ, పెళ్లి, ఫంక్షన్ ఇలా వేడుక ఏదైనా ఆభరణాల కోసం బంగారం కావాల్సిందే. అందుకే రోజు…
Banana Flower : అరటి పండ్లు మాత్రమే కాదు అరటి పువ్వు కూడా మన ఆరోగ్యానికి ఎంతగానో హెల్ప్ చేస్తుంది.…
This website uses cookies.