Pushpa 2 : పుష్ప‌2 ని టార్గెట్ చేసిన మెగా ఫ్యాన్స్.. ఆ దెబ్బ త‌ప్ప‌క ప‌డుతుందా ?

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 1 December 2024, 10:30 am
  •  Pushpa 2 : పుష్ప‌2 ని టార్గెట్ చేసిన మెగా ఫ్యాన్స్.. ఆ దెబ్బ త‌ప్ప‌క ప‌డుతుందా ?

Pushpa 2 : ప్ర‌స్తుతం దేశమంతటా కూడా పుష్ప‌2 సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంది. అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ తోపాటు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, యెర్నేని నవీన్, చెరుకూరి మోహన్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమా భారీ హిట్ కొడుతుంద‌ని అంద‌రు అనుకుంటున్నారు. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 12వేలకు పైగా స్క్రీన్లలో భారీగా విడుదల చేయబోతున్నారు. తమకు నచ్చిన భాషలో చూసుకునేందుకు నిర్మాతలు సినీ డబ్స్ అనే యాప్ ను అందుబాటులోకి తెచ్చారు.

Pushpa 2 : పుష్ప‌2 ని టార్గెట్ చేసిన మెగా ఫ్యాన్స్.. ఆ దెబ్బ త‌ప్ప‌క ప‌డుతుందా ?

Pushpa 2 : పుష్ప‌2 ని టార్గెట్ చేసిన మెగా ఫ్యాన్స్.. ఆ దెబ్బ త‌ప్ప‌క ప‌డుతుందా ?

Pushpa 2 మెగా కుట్ర‌..

నాలుగోతేదీ రాత్రి 11.00 గంటలకే షోలు వేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. నైజాం, ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాల్లో ఇంకా టికెట్ల బుకింగ్ ప్రారంభం కాలేదు. ఏపీ, తెలంగాణకు కలిపి పుష్ప2 ఎంత వసూలు చేయాల్సి ఉంటుంది? ఎంత వస్తే సినిమా హిట్ అవుతుంది? రాకపోతే ఏమవుతుంది? అనే ప్రశ్నలు ఇప్పుడు ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాను నిర్మాతలు ఆంధ్రలో రూ.90కోట్లకు అమ్మగా, నైజాంలో రూ.100 కోట్లకు అమ్మారు. సీడెడ్ లో రూ.30 కోట్లకు అమ్ముడుపోయింది. ఆ ధరలకు బయ్యర్లు ఇష్టపడి కొనుగోలు చేశారు. 20 శాతం కమిషన్, డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు, థియేటర్ అద్దెలు, 18 శాతం జీఎస్టీ అన్నీ తీస్తే రూ.220 కోట్లు సినిమా వసూలు చేయాల్సి ఉంది. అంటే దాదాపుగా పుష్ప2 ఏపీ, తెలంగాణలో రూ.450 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది

అయితే గ‌త కొద్ది రోజులుగా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఎఫెక్ట్ మూవీపై త‌ప్ప‌క ప‌డుతుంద‌ని అంటున్నారు.పుష్ప 2 కి ఏపీలో బెనిఫిట్ షోస్ ప్లాన్ చేస్తే ఆశ్చర్యకరంగా ఆ షోస్ కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదట. మెగా అభిమానుల సపోర్ట్ లేకపోతే అల్లు అర్జున్ కి బెనిఫిట్ షోస్ పడే సీన్ లేదు అంటూ కామెంట్స్ మొదలయ్యాయి. ఇది ప్రస్తుతం పెద్ద చర్చకే దారి తీయగా ఈ కొత్త కాంట్రవర్సీపై మరో వెర్షన్ వినిపిస్తుంది. కొన్ని చోట్ల మాత్రం మెగా ఫ్యాన్స్ బెనిఫిట్ షోస్ తీసుకుంటే కొన్ని చోట్ల అల్లు అర్జున్ అభిమానులు తీసుకుంటున్నారట. అల్లు అరవింద్ మీద గౌరవంతో చాలా మంది మెగా అభిమానులు తీసుకుంటున్నారని కొంద‌రి నుండి వినిపిస్తున్న టాక్.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
  1. "Heavy Rains : మూడు రోజులు భారీ వర్షాల హెచ్చరిక .. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ..!"

  2. "Guava leaves : రోజుకు రెండు ఈ ఆకులు నమిలితే చాలు.. శరీరానికి లభించే అద్భుత ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!"

  3. "Asafoetida water : ఉదయాన్నే ఇంగువ నీరు తాగితే ఏమవుతుంది?.. ఈ అద్భుత ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!"

  4. "Navagraha pradakshina : నవగ్రహ ప్రదక్షిణలు ఎలా చేయాలి? ..తర్వాత కాళ్లు కడుక్కోవాలా? ..శాస్త్రం చెప్పే నియమాలు ఇవే..!"

  5. "Vijay : INSTAGRAM CM అంటున్నారు .. విజయ్ కి అంత సీన్ లేదా ?"

  6. "YSRCP : ఆ నియోజికవర్గంలో వైసీపీ టోటల్ కొలాప్స్ .. ఒక్కడు కూడా లేడు..!"

  7. "AP High Court : గుడ్‌న్యూస్‌.. ఏపీ హైకోర్టు లో ఉద్యోగాలు .. వెంటనే అప్పాయింట్మెంట్ త్వరగా అప్లయ్ చేయండి"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp