Mega Family : మెగా ఫ్యామిలీ నుండి ఇప్ప‌ట్లో మ‌రో హీరో రాడా..!

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఉన్న ప్రముఖ కుటుంబాల‌లో మెగా ఫ్యామిలీ ఒక‌టి. ఆ కుటుంబం నుండి ఇండ‌స్ట్రీకి చాలా మందే వ‌చ్చారు. ఆ హీరోల‌తో క్రికెట్ టీం కూడా రెడీ చేయ‌వ‌చ్చు అనే టాక్ ఉంది. అయితే చిరంజీవి వేసిన బాట‌లో ప‌య‌నిస్తూ వ‌చ్చిన అంద‌రు హీరోలు త‌మ‌ని తాము నిరూపించుకున్నారు. అల్లుళ్ల‌ని సైతం చిరంజీవి హీరోలుగా నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేశాడు. త్వ‌ర‌లో మ‌రి కొంద‌రు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం కాబోతున్నార‌నే టాక్ వినిపిస్తుండ‌గా, దీనికి మ‌రింత స‌మ‌యం ప‌డుతుంద‌నే వాద‌న వినిపిస్తుంది. మ‌రి ఆ వివ‌రాలేంటో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. మీకు ఇంకా ఇలాంటి ఇంటరెస్టింగ్ వీడియోలు కావాలంటే మా చానెల్ ను ఫాలో అవ్వండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. స్వ‌యంకృషితో ఎదిగిన చిరంజీవి మెగాస్టార్‌గా ఎదిగిన వైనం మనంద‌రికి తెలుసు. సొంత క‌ష్టాన్ని న‌మ్ముకొనే ఈ స్థాయికి వ‌చ్చారు. అందుకే చిరంజీవి అంటే ప్ర‌తి ఒక్క‌రికి ప్ర‌త్యేక‌మైన గౌర‌వం.

చిరంజీవి వేసిన బాటలో పవన్ కళ్యాణ్ – నాగబాబు – రామ్ చరణ్ – అల్లు అర్జున్ – అల్లు శిరీష్ – వరుణ్ తేజ్ – సాయిధరమ్ తేజ్ – పంజా వైష్ణవ్ తేజ్ – కళ్యాణ్ దేవ్ – నిహారిక వంటి వారు ఇండస్ట్రీకి వచ్చారు. ఇదే ఫ్యామిలీ పేరు చెప్పుకుని పవన్ తేజ్ కొణిదెల వంటి వారు కూడా హీరోలుగా లాంచ్ అయ్యారు. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల వివాహం చేసుకున్నప్పటి నుంచీ అల్లుడు జేవీ చైతన్య కూడా వెండితెరపై మెగా అరంగేట్రం చేస్తాడేమో అని అందరూ భావించారు. ఇప్పటికే చిరంజీవి రెండో కూతురు శ్రీజ ను వివాహం చేసుకున్న కళ్యాణ్ దేవ్ ని హీరోగా పరిచయం చేసారు. కాని అంత‌గా రాణించ‌లేక‌పోయాడు. అది వేరే విష‌యం అనుకోండి. కొద్ది రోజులుగా నిహారిక భర్త కూడా సినీ రంగ ప్రవేశం చేయిస్తారని అనుకున్నారు. అయితే ఇటీవల చైతన్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఎప్పుడైనా తెరంగేట్రం చేయబోనని క్లారిటీ ఇచ్చాడు. తనకు నటుడిగా మారాలనే ఆసక్తి లేదని.. ప్రస్తుతం తను చేస్తున్న పనితో సౌకర్యవంతంగా ఉన్నానని మెగా అల్లుడు తెలిపాడు. కాకపోతే చైతన్య తెర మీదకు రాకపోయినా.. ఇప్పటికే ప్రొడక్షన్ లోకి దిగాడు.

Mega family on another hero Rada

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్ లో నిహారికతో కలిసి వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నాడు. నిహారిక సైతం వివాహం చేసుకున్నప్పటి నుండి నటనకు దూరంగా ఉంటూ.. వెబ్ సిరీసుల నిర్మాణం పైనే దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత మరియు ఆమె భర్త విష్ణు ప్రసాద్ కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా మెగా ఫ్యామిలీలో అందరూ ఏదొక విధంగా ఇండస్ట్రీలో ఉన్నారు. కొందరు తెర మీద క్లిక్ అయితే మరికొందరు తెర వెనుక రాణిస్తున్నారు. కాకపోతే ఇప్పట్లో ఈ కుటుంబం నుంచి మరో కొత్త హీరో వచ్చే అవకాశం లేదు. భవిష్యత్ లో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ లేదా అల్లు అర్జున్ కొడుకు అయాన్ హీరోలుగా ఎంట్రీ ఇస్తారేమో. అల్లు అర్జున్ త‌న‌య అర్హ తెరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్హ భరతుడి పాత్ర పోషిస్తుంది. శాకుంతలంలో అర్హకు సంబంధించిన షూటింగ్‌ పూర్తి కావడంతో చిత్ర యూనిట్‌ ఆమెకు గ్రాండ్‌గా వీడ్కోలు పలికింది.

ఈ సెలబ్రేషన్స్‌లో అల్లు అర్జున్‌తో పాటు ఆయన భార్య స్నేహారెడ్డి కూడా పాల్గొన్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో శాకుంత‌లగా సమంత నటిస్తుండగా, మలయాళ యంగ్ హీరో దుశ్యంతుడిగా నటిస్తున్నాడు. శకుంతల, దుష్యంతుడి కుమారుడైన భరతుడు పాత్రలో అర్హ కనిపించనుంది. ఈ సినిమాతో చిన్నారి అంద‌రి దృష్టి ఆక‌ర్షించ‌డం ప‌క్కా అంటున్నారు. ఇక అకీరా విష‌యానికి వ‌స్తే ఆయ‌న ఎంట్రీ కోసం మెగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అకీరా మల్టీటాలెంటెడ్. కేవలం చదువులోనే కాకుండా.. సంగీతంలో, ఆటలలో మంచి పట్టు సాధించాడు.. ముఖ్యంగా పియానో వాయించడంలో అకీరా దిట్ట అన్న సంగతి తెలిసిందే. గతంలో అకీరా ఇంట్లో పియానో వాయిస్తున్న వీడియోలను రేణు దేశాయ్ తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేస్తూనే వస్తుంది. అకీరా మల్టీటాలెంట్స్ చూసి పవన్ ఫ్యాన్స్ సైతం ఫుల్ ఖుషి అవుతుంటారు. ఇటీవ‌ల ఆర్ఆర్ఆర్ సినిమాలోని దోస్తీ పాటకు తన స్నేహితుల కోసం అద్భుతంగా పియానో వాయించాడు.. ఆయ‌న త్వ‌ర‌లోనే ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇస్తాడ‌ని అంటున్నారు.

Recent Posts

Tight Jeans : టైట్ దుస్తులు ధరించడం ఫ్యాషన్ కాదు… ఆ విష‌యంలో పెద్ద ముప్పే..!

Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్‌లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…

59 minutes ago

Whisky Wine : స్కీలో ఐస్ వేసుకొని తాగుతారు.. మ‌రి వైన్‌లో ఎందుకు వేసుకోరు..!

Whisky Wine : మద్యం ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, కొందరు సరదాగా తాగుతుంటారు. అయితే మద్యం…

2 hours ago

Samudrika Shastra : పురుషుల‌కి ఈ భాగాల‌లో పుట్టు ముచ్చ‌లు ఉన్నాయా.. అయితే ఎంత అదృష్ట‌మంటే..!

Samudrika Shastra : హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రత్యేక స్థానం పొందిన సాముద్రిక శాస్త్రం ఒక పురాతన విద్య. ఇది వ్యక్తి…

3 hours ago

Olive Oil vs Coconut Oil : గుండెకి మేలు చేసే ఆయిల్ గురించి మీకు తెలుసా.. ఇది వాడ‌డ‌మే ఉత్త‌మం

Olive Oil vs Coconut Oil : గుండె ఆరోగ్యం కోసం ఏ నూనె ఉపయోగించాలి అనే విషయంపై ప్రజల్లో…

4 hours ago

Gowtam Tinnanuri : కింగ్‌డమ్ చిత్రం ఘ‌న విజ‌యం సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉంది : గౌతమ్ తిన్ననూరి

Gowtam Tinnanuri  : విజయ్ దేవరకొండ vijay devarakonda కథానాయకుడిగా నటించిన చిత్రం 'కింగ్‌డమ్' kingdom movie . గౌతమ్…

4 hours ago

Copper Water Bottles : కాప‌ర్ వాట‌ర్ బాటిల్ వాడేట‌ప్పుడు ఈ నియ‌మాలు త‌ప్ప‌నిస‌రి.. లేదంటే అంతే…!

Copper Water Bottles : కాప‌ర్ బాటిల్ వాడేట‌ప్పుడు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే.. నిమ్మకాయ నీరు, జ్యూస్ లేదా…

5 hours ago

Coolie Movie : ‘కూలీ’లో సైమన్ క్యారెక్టర్ ఆల్ మోస్ట్ హీరో లాంటిది : నాగార్జున

Coolie Movie : సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ పై…

5 hours ago

Oriental Jobs : ఓరియంటల్ ఇన్సూరెన్స్‌లో 500 అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్.. తెలుగు రాష్ట్రాల్లో 26 ఖాళీలు

Oriental Jobs  : కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖ పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ…

6 hours ago