Chiranjeevi Mother : ఉపాసన ప్రెగ్నెంట్ అయినా కూడా సంతోషంగా లేరు …? కోపంగా ఉన్న చిరంజీవి తల్లి …?
Chiranjeevi Mother : ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూస్తున్న కోట్లాదిమంది మెగా అభిమానులకు ఏట్టకేలకు శుభవార్త రానే వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు అనే వార్తను అభిమానంతో పంచుకున్నాడు మెగాస్టార్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన స్టైల్ లో సినిమాలు చేస్తూ ఆల్ ఇండియా హీరోగా ఎదిగాడు రామ్ చరణ్. ఇక ఇప్పుడు భారీ బిగ్ ప్రాజెక్టులో భాగమై ఉన్నాడు. అయితే రామ్ చరణ్ లైఫ్ ఏలాంటి టెన్షన్ లేకుండా ముందుకు వెళుతుంది కానీ ఆయనకు పిల్లలు లేరన్న బాధ ఆయనతోపాటు ఆయన ఫ్యామిలీ అండ్ అభిమానులకు ఉండింది.
ఇదే క్రమంలో ఒకప్పుడు సోషల్ మీడియాలో పలువురు రాంచరణ్ ను ట్రోల్ చేయడం కూడా జరిగింది. కాగా పెళ్లయిన 10 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ భార్య ఉపాసన గర్భం దాల్చింది. ఇక ఈ గుడ్ న్యూస్ అఫీషియల్ గా మెగాస్టార్ చిరంజీవి అభిమానంతో పంచుకున్నాడు. దీంతో ఈ న్యూస్ నెట్టింటా హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఇప్పుడు ఉపాసనకి మూడు నెలలు కంప్లీట్ అయినట్లుగా సమాచారం. అంతేకాక ఆమె ఫీట్ గా హెల్తీగా ఉన్నప్పటికీీ ఉపాసన గర్భసంచి కొంచెం వీక్ గా ఉందని చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సలహాలు ఇచ్చారట.
Mega family very happy about upasana pregnancy but Chiranjeevi Mother not
అయితే ఈ న్యూస్ తెలిసిన తర్వాత వారింట్లో వారందరూ చాలా సంతోషపడుతున్నారట కానీ చిరంజీవి అమ్మగారు అంజనమ్మ మాత్రం హ్యాపీగా లేరని సమాచారం. ఉపాసన ప్రెగ్నెన్సీ పూర్తి అయి బిడ్డ బయటకు వచ్చేవరకు ఆమె టెన్షన్ గానే ఉంటుందట. దీంతో కోడలు సురేఖ కూడా అత్తగారికి ధైర్యం చెప్పి , నా కోడలికి ఏం కాదు హెల్తిగా ఉంటుంది అత్తయ్య అని చెప్పుకొచ్చారట. ఏది ఏమైనా పెళ్లి అయిన పదేళ్లకి ఉపాసన ప్రెగ్నెంట్ అయిందని ఆనందపడాలో లేక ప్రెగ్నెన్సీ కొంచెం వీక్ గా ఉందని బాధపడాలో మెగా ఫ్యాన్స్ కి అంతు చిక్కడంలేదు . ఏది ఏమైనా సరే ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వలని అందరూ కోరుకుంటున్నారు.
