
mega fans angry on nandamuri fans and kalyan ram
Megastar : నందమూరి కళ్యాణ్ రామ్-Kalyan Ram హీరోగా వచ్చిన బింబిసార-Bimbisara మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక మంచి కథను కళ్యాన్ రామ్ నటనతో ఆకట్టుకునేలా చేశాడు. ఆ కథ కు పెద్ద హీరో అయ్యి ఉంటే వంద కోట్ల సినిమా అయ్యి ఉండేది.. పాన్ ఇండియా స్థాయి లో ఓ రేంజ్ లో బింబిసార ఆడేది. కాని కళ్యాణ్ రామ్ కు ఉన్న వరుస ప్లాప్ ల ట్రాక్ రికార్డ్ కారణంగా బింబిసార సినిమాకు ఒక మోస్తరు బిజినెస్ జరిగింది.. అంతే కాకుండా ఒక మోస్తరుగానే ఓపెనింగ్ వసూళ్లు నమోదు అయ్యాయి. లాంగ్ రన్ లో ముప్పై నుండి నలబై కోట్లు రాబడితే గొప్ప విషయం అన్నట్లుగా ఉంది.
ఇదే సమయంలో నందమూరి కళ్యాణ్ రామ్ ను సోషల్ మీడియా లో మెగాస్టార్ నందమూరి కళ్యాన్ రామ్ అంటూ కొందరు అభిమానులు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉంది. నందమూరి కళ్యాణ్ రామ్ ఒక్క సక్సెస్ అవ్వగానే మెగా స్టార్ అయ్యాడా అంటూ మెగా ఫ్యాన్స్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నందమూరి ఫ్యామిలీ లో ఏ ఒక్కరికి మెగాస్టార్ ట్యాగ్ సెట్ అవ్వదు అని.. మెగా అనేది కేవలం చిరంజీవికి మాత్రమే వర్తిస్తుంది అంటూ మెగా ఫ్యాన్స్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు.
mega fans angry on nandamuri fans and kalyan ram
ఈ విషయంలో కొందరు మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నందమూరి ఫ్యాన్స్ కు యాంటీ ఫ్యాన్స్ గా మారి వాదనకు దిగుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ రచ్చ జాతీయ స్థాయిలో జరుగుతోంది. మొన్న మెగా స్టార్ నందమూరి కళ్యాణ్ రామ్ హ్యాష్ ట్యాగ్ ఏకంగా జాతీయ స్థాయి లో ట్విట్టర్ లో ట్రెండ్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. దాదాపుగా 15 వేలకు పైగా మెగా స్టార్ కళ్యాణ్ రామ్ అంటూ ట్వీట్స్ పడటం తో అంతా అవాక్కయ్యారు. కళ్యాణ్ రామ్ ఈ విషయమై స్పందించక పోవడంతో నీకు అంత సీన్ లేదు భయ్యా… నువ్వు అయినా స్పందించాలి కదా అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.