producer warns to pooja hegde
Pooja Hegde : మోస్ట్ వాంటెడ్ హీరోయినా కూడా ఇండస్ట్రీలో ఉన్న సెంటిమెంట్ ప్రకారం రెండు వరుస ఫ్లాప్స్ పడితే..ఆ హీరోయిన్ నటించిన సినిమా రిలీజ్ అయ్యే ముందు మేకర్స్‌కు ఫ్యాన్స్‌కు అదే బ్యాడ్ సెంటిమెంట్ మనసులో ఉండి సినిమా రిలీజయ్యేవరకు టెన్షన్‌గా ఉంటారు. ఇప్పుడు ఆచార్య సినిమాలో పూజా హెగ్డే నటించడంతో అదే ఫీలవుతున్నారట మెగా అభిమానులు. వాస్తవంగా పూజాకు వచ్చిన క్రేజ్ ఫ్లోలో వచ్చిందేనని ఎప్పటి నుంచో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె కెరీర్ స్టార్టింగ్‌లో ఏ ఇండస్ట్రీలో సినిమా చేసినా హీరోయిన్‌గా ఫ్లాపే అందుకుంది.
ఆ తర్వాత మహర్షి సినిమాతో హిట్ అందుకున్న పూజా హెగ్డే అరవింద సమేత లాంటి అబౌ యావరేజ్ హిట్, అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ ఒకటి అందుకుంది. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా కూడా హిట్ అంటే హిట్ అని చెప్పుకోవాలి. భారీ కమర్షియల్ హిట్ అని కూడా చెప్పలేము. ఈ లెక్కన చూస్తే పూజా ఖాతాలో సాలీడ్ హిట్ అంటే రెండు సినిమాలు..మరీ చెప్పుకుంటే మూడు సినిమాలు. కానీ, ఆమె వెనకాల మాత్రం దర్శక – నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఈ విషయం పక్కనపెడితే, పాన్ ఇండియన్ సినిమాలుగా వచ్చిన రాధే శ్యామ్, తమిళ హీరో విజయ్ నటించిన బీస్ట్ ఘోర పరాజయాన్ని అందుకున్నాయి.రాధే శ్యామ్ మరీ ఇంత భారీ డిజాస్టర్ అవుతుందని ప్రభాస్ కూడా ఊహించి ఉండడేమో.
mega fans are in tension regarding pooja hegde
ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ సినిమాలు ఫ్లాపవడంతో ఆచార్య సినిమా విషయంలో సహజంగానే మనవాళ్ళకు ఉన్న సెంటిమెంట్ ప్రకారం టెన్షనే ఉంటుంది. అసలే ఆచార్యలో మేయిన్ హీరో మెగాస్టార్ చిరంజీవి అయితే ఆయన సరసన అనుకున్న కాజల్‌ను తీసేశారు. ఇప్పుడు చిరు సరసన హీరోయిన్ లేదనే విషయం పెద్ద డిసప్పాయింట్‌గా ఉంది. గెస్ట్ పాత్ర అనుకున్న చరణ్ పాత్రను హైలెట్ చేస్తూ తన సరసన హీరోయిన్‌గా పూజాను తీసుకొని ఆమెనే హైలెట్ చేస్తున్నారు. వాస్తవంగా పూజా ఇందులో కనిపించేది ఒక్క పాట మహా అయితే ఓ నాలుగైదు సీన్స్. కానీ, ఆచార్య రిజల్ట్ విషయంలో మాత్రం పూజానే హాట్ టాపిక్ అవుతోంది. పొరపాటున ఆచార్య రిజల్ట్ కాస్త అటు ఇటూగా ఉంటే మాత్రం ముందు ఆడేసుకునేది పూజానే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…
Special Song | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన చిత్రం ‘OG (They Call Him…
Revanth Reddy | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. హైకోర్టు తాజా తీర్పు…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓజీ (They Call Him OG)’…
Akhanda 2 | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ చిత్రం ‘అఖండ 2’ ప్రస్తుతం షూటింగ్…
This website uses cookies.