Megastar Chiranjeevi : దటీజ్ చిరు.. శివ శంకర్ మాస్టర్ కుటుంబాన్ని ఆదుకున్న మెగాస్టార్
Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి తన వంతు సాయం అందజేశారు. రూ. 3 లక్షలు చెక్కును శివ శంకర్ మాస్టర్ కుమారుడు అజయ్ శివశంకర్‌కు ఇచ్చారు. అంతేకాకుండా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శివ శంకర్ మాస్టర్ ఇటీవల ఆచార్య సెట్‌కు కూడా వచ్చారని చిరంజీవి గుర్తుచేసుకున్నారు. శివ శంకర్ మాస్టర్ కు తామంతా ఉన్నాం అని హామీ ఇచ్చారు.
ఇక, శివ శంకర్ మాస్టర్ కుటుంబంలో ముగ్గురికి కరోనా సోకింది. మాస్టర్‌తో పాటు ఆయన భార్య, పెద్ద కుమారుడు కూడా కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం శివ శంకర్ మాస్టర్ హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 75 శాతం ఆయన ఊపిరితిత్తులు పాడయ్యాయని, మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా డాక్టర్స్ తెలిపారు. మరోవైపు శివ శంకర్ మాస్టర్ భార్య హోంక్వారంటైన్‌లో ఉండగా.. కుమారుడు సైతం ఆసుపత్రిలో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు.

Megastar Chiranjeevi Helped Shiva Shankar Master family with 3 lakhs donation.
Megastar Chiranjeevi : అండగా నిలిచిన చిరు..
అయితే చికిత్సకు భారీగా ఖర్చు అవుతుండటంతో తమ కుటుంబానికి సాయం చేయాల్సిందిగా అజయ్ శివ శంకర్ సినీ పెద్దలను కోరారు. ఈ క్రమంలోనే ఆయనకు ఫోన్ చేసిన చిరంజీవి.. ఇంటికి పిలిచి మూడు లక్షల రూపాయల చెక్ అందజేశారు. ఆ కుటుంబానికి తాము తోడుగా ఉంటామనే ధైర్యాన్ని ఇచ్చారు. అనంతరం అజయ్ మాట్లాడుతూ.. ‘చిరంజీవి గారికి తాము ఎప్పుడు రుణం పడి ఉంటాం. నాన్న ఆరోగ్యం గురించి తెలుసుకున్న వెంటనే చిరంజీవి గారు ఫోన్ చేసి పిలిపించారని.. తక్షణ సాయం కింద రూ. 3 లక్షలు ఇచ్చారు. చిరంజీవి గారితో కలిసి నాన్న చాలా సినిమాలు చేశారు’అని చెప్పారు. ఇప్పటికే ప్రముఖ నటుడు సోనూసూద్ కూడా శివశంకర్ మాస్టర్ కుటుంబానికి సాయం చేసేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే