Chiranjeevi – Ponnambalam : చాలామంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ.. అందరికీ వాళ్ల సేవా కార్యక్రమాల గురించి తెలియదు. కొందరు పబ్లిసిటీ చేసుకోరు. మరికొందరు పబ్లిసిటీ చేస్తూ సాయాలు చేస్తుంటారు. ఎంతో సేవ చేసినా కూడా ఇప్పటికీ తన పేరును బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడరు మెగాస్టార్ చిరంజీవి. ఆయన తెలుగు ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఒక బ్లడ్ బ్యాంక్ కావచ్చు.. ఒక ఐ బ్యాంక్ కావచ్చు.. ఇవన్నీ తెలుగు ప్రజల కోసం, తన అభిమానుల కోసం ఉచితంగా తీసుకొచ్చిన సేవా కార్యక్రమలు. అవే కాకుండా.. ఎంతో మందికి ఆపదలో ఉన్నవారిని ఆదుకొని తన సేవా గుణాన్ని చాటారు చిరంజీవి.

కరోనా సమయంలో ఆక్సీజన్ బ్యాంక్ ను ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల్లో ఆక్సీజన్ కావాల్సిన వాళ్లకు ఉచితంగా సిలిండర్లను సప్లయి చేశారు. తన అభిమానులు, ప్రజలకే కాదు.. ఇండస్ట్రీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండి ఆదుకుంటారు చిరంజీవి.తమిళ నటుడు, ప్రముఖ విలన్ పాన్నాంబళం తెలుసు కదా. ఆయన చాలా సినిమాల్లో విలన్ గా నటించాడు. ఆయనకు ఆరోగ్యం బాగా లేని సమయంలో చిరంజీవి సాయం చేశారట. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.40 లక్షలు సాయం చేశారట.
Chiranjeevi – Ponnambalam : తమిళ నటుడు పొన్నాంబళానికి చిరంజీవి సాయం
ఈ విషయాన్ని చిరంజీవి ఏనాడూ చెప్పుకోలేదు. కానీ.. పొన్నాంబళమే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి చేసిన సాయం గురించి చెప్పారు. ఒక దశలో నేను చనిపోయే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు నేను వైద్యం చేయించుకోవడానికి నాదగ్గర డబ్బులు లేవు. దీంతో చిరంజీవి గారికి పోన్ చేశాను. నా పరిస్థితి చెప్పాను. దీంతో వెంటనే ఆయన అపోలో ఆసుపత్రికి వెళ్లి ట్రీట్ మెంట్ చేయించుకోమన్నారు. ఏదో ఒకటి రెండు లక్షలు ఇస్తారు కావచ్చు అనుకున్నా కానీ.. నాకు రూ.40 లక్షలు ఇచ్చారు. నా వైద్యానికి అయిన ఖర్చు మొత్తం పెట్టుకున్నారు.. అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.