MM Keeravaani : పంచతంత్ర కథలు సినిమాలో క్యారెక్టరైజేషన్స్ అన్ని కొత్తగా ఉన్నాయి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎంఎం కీరవాణి..?

Authored By mallesh | The Telugu News | Published on: July 9, 2022, 5:25 pm

MM Keeravaani : ఐదు వేరు వేరు కథల సమూహారంగా రూపొందించిన సినిమా పంచతంత్ర కథలు ఈ సినిమాకు గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో శేఖర్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ సినిమాను మధు క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్ వ్యాపారవేత్త అయిన డి.మధు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో నోయెల్, నందిని, రారు,సాయి రోనక్, గీతా భాస్కర్, ప్రణీత పట్నాయక్, నిహాల్ కొదర్తి, సాదియా పలువురు కీలకపాత్రలో నటిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి మోతెవరి అని సాంగ్. ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది.

MM Keeravaani comments on Panchatantra Kathalu Trailer

MM Keeravaani comments on Panchatantra Kathalu Trailer

కాగా ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు అయిన ఎంఎం కీరవాణి విడుదల చేశారు. ట్రైలర్ ని విడుదల చేసిన తర్వాత ఎం ఎం కీరవాణి మాట్లాడుతూ.. దర్శకుడు గంగనమోని శేఖర్ దర్శకత్వంలో మధు క్రియేషన్స్ పతాకంపై పంచతంత్ర కథలు అనే ఈ ఆంథాలజీ ఐదు వేరు వేరు కథలు, వేరువేరు జోన్లలో రావడం అన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అని తెలిపారు. అలాగే ట్రైలర్ కూడా చాలా బాగుందని, సినిమాలో క్యారెక్టర్రైజేషన్ అన్ని కొత్త కొత్తగా ఉన్నాయి అని చెప్పుకొచ్చారు ఎంఎం కీరవాణి. అనంతరం నోయెల్ గురించి మాట్లాడుతూ..

మా ఫ్యామిలీ మెంబర్ నోయెల్ ఈ సినిమాలు నటిస్తున్నాడు అని తెలిపారు. ఈ సినిమా కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అని చెప్పుకొచ్చారు ఎం ఎం కీరవాణి. ఇది ఇలా ఉంటే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు అన్ని పూర్తి అయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా యూఏ సర్టిఫికెట్ను కూడా పొందింది. ఈ సందర్భంగా సెన్సార్ సభ్యులు ఈ సినిమాను చూసి చిత్తయి వీటిని అభినందించడం జరిగింది. కాగా ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీ తెలియక పోగా త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నారు చిత్ర బృందం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

mallesh

No bio available for this author.

Tags :
    1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

    2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

    3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

    4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

    5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

    6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

    7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

    Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
    WhatsApp