Mohan Babu : తండ్రి చనిపోతే తన స్కూల్‌లో చదివించిన మోహన్ బాబు.. స్టార్ హీరోయిన్‌గా.. కోట్లు సంపాదిస్తుంది తెలుసా..?
ప్రధానాంశాలు:
Mohan Babu : తండ్రి చనిపోతే తన స్కూల్‌లో చదివించిన మోహన్ బాబు.. స్టార్ హీరోయిన్‌గా.. కోట్లు సంపాదిస్తుంది తెలుసా..?
Mohan Babu : టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా, విలన్‌గా, కమెడియన్‌గా, హీరోగా ఎన్నో మైలురాయిలను చేరుకున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విద్యా రంగంలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. చిన్న ఆలోచనతో ఆయన శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలు స్థాపించారు. చిన్న స్థాయిలో ప్రారంభమైన ఈ ప్రయాణం, ఇప్పుడు యూనివర్సిటీ స్థాయికి చేరింది…

Mohan Babu : తండ్రి చనిపోతే తన స్కూల్‌లో చదివించిన మోహన్ బాబు.. స్టార్ హీరోయిన్‌గా.. కోట్లు సంపాదిస్తుంది తెలుసా..?
Mohan Babu : గొప్ప మనసు..
ఆ రోజు పెట్టిన చిన్న స్కూల్ ఇప్పుడు వేలాది మంది విద్యార్థులకు విద్యనందించే సంస్థగా ఎదిగింది. ఎంతో మంది బడుగు విద్యార్థులకు ఉచిత విద్యను అందించడంలో మోహన్ బాబు చూపిన పెద్ద మనసు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఓ సందర్భంగా ఆయన తన ఇంటర్వ్యూలో ఒక స్పెషల్ స్టూడెంట్ గురించి ప్రస్తావించారు. తన స్కూల్లో చదివిన ఓ అమ్మాయి ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలో క్రేజీ హీరోయిన్ అయిందని, కానీ తన పేరు గుర్తుకు రాలేదని చెప్పారు. ఆమెే మరెవరో కాదు, ఇప్పుడు కోలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న ఐశ్వర్య రాజేష్!
ఐశ్వర్య రాజేష్, టాలీవుడ్ నటుడు రాజేష్ కుమార్తె. ఆమె చిన్నప్పుడు తండ్రిని కోల్పోయిన తర్వాత తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ స్కూల్‌లో చదువుకుని, అక్కడినుంచి చెన్నైకి వెళ్లి సినీ రంగంలో అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆమె కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఇటీవల ఆమె నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు వసూలు చేయగా, ఇందులో వెంకటేశ్ కూడా నటించారు.