Monal gajjar : మందు తాగుతూ షో ఎంజాయ్ చేసిన మోనాల్ గజ్జర్..
Monal gajjar : మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ సీజన్‌కి ముందు టాలీవుడ్‌లో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయింది. ఓ రెండు సినిమాలు చేసిన తర్వాత తన మాతృభాషకి పరిమితమయింది. అక్కడ బాగానే సినిమాలు చేస్తూ బిజీగా ఉంది గానీ తెలుగువారు మాత్రం మర్చిపోయారు. అసలు మోనాల్ గజ్జర్ అనే ఒక టాలీవుడ్ హీరోయిన్ ఉందని ఏ ఒక్కరికి గుర్తు లేదు. కానీ బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా వచ్చి దాదాపు షో చివరికి వరకు ఎలిమినేట్ అవకుండా తన స్కిన్ షోతో నెట్టుకొచ్చింది.

monal-gajjar-enjoyed-the-show-while-drinking
ఈ ఊపులోనే బాగా పాపులర్ అయింది. ఓవర్ ఎక్స్‌పోజింగ్ చేసి జనాలని బాగానే ఆకట్టుకుంది. అసలు మోనాల్ ఎందుకు ఇన్నాళ్ళు బిగ్ బాస్‌లో కంటిన్యూ అవుతుందనుకున్న వాళ్ళే ఎక్కువ. అయినా నిర్వాహకులు మోనాల్‌ను హౌజ్ నుంచి బయటకు పంపలేదు. అలా టాలీవుడ్ మేకర్స్‌ను కూడా ఆకట్టుకుంది. ఈ క్రమంలో అల్లుడు అదుర్స్ సినిమాలో ఐటెం సాంగ్ చేసే అవకాశం అందుకుంది. ఇందులో తన అందచందాలతో..ఎద ఒంపులతో క్రేజ్ తెచ్చుకుంది. జనాలలో ఉన్న క్రేజ్ దృష్ఠిలో పెట్టుకొని ఓం కార్ బిగ్ బాస్ స్లాట్‌లో డాన్స్ షో తీసుకు వచ్చాడు.
Monal gajjar : మోనాల్ గజ్జర్ చల్లటి బీర్ తాగుతూ ఎంజాయ్ చేసింది.
ఇందులో మోనాల్ ఒక జడ్జ్ అంటే ఫ్యూజులు కొట్టేసిన జనాలు ఎంతమందో. డ్యాన్స్ ప్లస్ అనే ఆరుగురు జడ్జెస్‌లో ఒక జడ్జ్ గా మోనాల్ తన అందచందాలతో అదరగొట్టింది. కాగా ఇటీవలే ఈ షో ఫినల్ ఎపిసోడ్ కంప్లీట్ అయిన గత ఆదివారం ప్రసారమైంది. ఈ ఫినాలే ఎపిసోడ్‌ను మోనాల్ ఇంట్లో చల్లటి బీర్ తాగుతూ ఎంజాయ్ చేసింది. అంతేకాదు ఈ ఎపిసోడ్‌ను చూస్తున్నట్టు ఓ పిక్ తీసి సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసింది ఈ బబ్లీ బ్యూటీ. ప్రస్తుతం ఈ పిక్ వైరల్‌గా మారింది.