movie and political war brahmastra team lose big amount of money
Cinema Vs Political : తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు సినిమా వేరు రాజకీయాలు వేరు అన్నట్లుగా ఉండేది. కానీ ఇప్పుడు సినిమా మరియు రాజకీయం కలిసిపోయినట్లుగా అనిపిస్తుంది. ఒక వర్గం వారు ఒక పార్టీకి మరో వర్గం వారు ఇంకో పార్టీకి అన్నట్లుగా మద్దతు తెలుపకున్నా కూడా సినీ వర్గాల్లో రాజకీయాలు కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా బాలీవుడ్ పెద్ద సినిమా బ్రహ్మాస్త్ర యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ చివరి నిమిషంలో క్యాన్సల్ అయ్యేలా అనుమతులను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కావలసిన ఆ యొక్క కార్యక్రమం చివరి నిమిషంలో క్యాన్సల్ అవ్వడంతో ఏకంగా రెండున్నర కోట్ల రూపాయలు నిర్మాతకు మరియు ఈవెంట్ ఆర్గనైజేషన్ కి నష్టం జరిగినట్లుగా సమాచారం అందుతుంది.
కొన్ని వందల ఈవెంట్లను నిర్వహించిన శ్రేయాస్ మీడియా వారు ఈ వెంట్ ని రామోజీ ఫిలిం సిటీ లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. దాదాపుగా వారు రెండున్నర కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఎంతో కష్టపడి పది రోజుల పాటు ఏర్పాటలోనే చేస్తున్నారు. రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా దాదాపు మూడు రోజులుగా రామోజీ ఫిలిం సిటీ లోనే ఉండి బ్రహ్మాస్త్ర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వేదికను సిద్ధం చేయిస్తున్నాడు. పదుల సంఖ్యలో జనాలు కష్ట పడి వారం పది రోజులుగా వేసిన భారీ స్టేజ్ ఇప్పుడు వినయోగం లేకుండా అయింది. కనీసం స్టార్స్ ఆ స్టేజి కూడా ఎక్కకుండానే తీసి వేయాల్సి వచ్చింది.
movie and political war brahmastra team lose big amount of money
రెండున్నర కోట్ల రూపాయలు ప్రభుత్వం వల్ల నష్టపోయిన బ్రహ్మాస్త్ర టీం కనీసం ప్రభుత్వం మీద చిన్న విమర్శ కూడా చేయకుండా సైలెంట్ గా వెళ్ళి పోయింది. మరోవైపు శ్రేయస్ మీడియా కూడా ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై ఎలాంటి వ్యాఖ్యలను చేయలేదు. అయితే ఎన్టీఆర్ అభిమానులు మరియు రాజమౌళి అభిమానులు మాత్రం కార్యక్రమం రద్దు వెనుక నూటికి నూరు శాతం ప్రభుత్వ పెద్దల హస్తముందని, కేవలం ఎన్టీఆర్ ఇటీవల అమిత్ షాను కలవడం వల్లే ఈ కార్యక్రమాన్ని చివరి నిమిషంలో రద్దు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నెల 25వ తారీకు ఉన్నాయి శ్రేయస్ మీడియా వారు పోలీసులకు ఈ కార్యక్రమం నిర్వహణ యొక్క అనుమతులు తీసుకున్నారు. ఆ సమయంలో అనుమతించి ఇప్పుడు ఎందుకు నిరాకరించారనేది వాళ్లకే తెలియాలి అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.