Cinema Vs Political : సినిమా వర్సెస్‌ పొలిటికల్‌ గేమ్‌ లో వారు నష్టపోయింది రెండున్నర కోట్లు! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Cinema Vs Political : సినిమా వర్సెస్‌ పొలిటికల్‌ గేమ్‌ లో వారు నష్టపోయింది రెండున్నర కోట్లు!

Cinema Vs Political : తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు సినిమా వేరు రాజకీయాలు వేరు అన్నట్లుగా ఉండేది. కానీ ఇప్పుడు సినిమా మరియు రాజకీయం కలిసిపోయినట్లుగా అనిపిస్తుంది. ఒక వర్గం వారు ఒక పార్టీకి మరో వర్గం వారు ఇంకో పార్టీకి అన్నట్లుగా మద్దతు తెలుపకున్నా కూడా సినీ వర్గాల్లో రాజకీయాలు కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా బాలీవుడ్ పెద్ద సినిమా బ్రహ్మాస్త్ర యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ చివరి నిమిషంలో క్యాన్సల్ అయ్యేలా […]

 Authored By aruna | The Telugu News | Updated on :4 September 2022,7:30 am

Cinema Vs Political : తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు సినిమా వేరు రాజకీయాలు వేరు అన్నట్లుగా ఉండేది. కానీ ఇప్పుడు సినిమా మరియు రాజకీయం కలిసిపోయినట్లుగా అనిపిస్తుంది. ఒక వర్గం వారు ఒక పార్టీకి మరో వర్గం వారు ఇంకో పార్టీకి అన్నట్లుగా మద్దతు తెలుపకున్నా కూడా సినీ వర్గాల్లో రాజకీయాలు కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా బాలీవుడ్ పెద్ద సినిమా బ్రహ్మాస్త్ర యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ చివరి నిమిషంలో క్యాన్సల్ అయ్యేలా అనుమతులను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కావలసిన ఆ యొక్క కార్యక్రమం చివరి నిమిషంలో క్యాన్సల్ అవ్వడంతో ఏకంగా రెండున్నర కోట్ల రూపాయలు నిర్మాతకు మరియు ఈవెంట్ ఆర్గనైజేషన్ కి నష్టం జరిగినట్లుగా సమాచారం అందుతుంది.

కొన్ని వందల ఈవెంట్లను నిర్వహించిన శ్రేయాస్ మీడియా వారు ఈ వెంట్ ని రామోజీ ఫిలిం సిటీ లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. దాదాపుగా వారు రెండున్నర కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఎంతో కష్టపడి పది రోజుల పాటు ఏర్పాటలోనే చేస్తున్నారు. రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా దాదాపు మూడు రోజులుగా రామోజీ ఫిలిం సిటీ లోనే ఉండి బ్రహ్మాస్త్ర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వేదికను సిద్ధం చేయిస్తున్నాడు. పదుల సంఖ్యలో జనాలు కష్ట పడి వారం పది రోజులుగా వేసిన భారీ స్టేజ్ ఇప్పుడు వినయోగం లేకుండా అయింది. కనీసం స్టార్స్ ఆ స్టేజి కూడా ఎక్కకుండానే తీసి వేయాల్సి వచ్చింది.

movie and political war brahmastra team lose big amount of money

movie and political war brahmastra team lose big amount of money

రెండున్నర కోట్ల రూపాయలు ప్రభుత్వం వల్ల నష్టపోయిన బ్రహ్మాస్త్ర టీం కనీసం ప్రభుత్వం మీద చిన్న విమర్శ కూడా చేయకుండా సైలెంట్ గా వెళ్ళి పోయింది. మరోవైపు శ్రేయస్ మీడియా కూడా ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై ఎలాంటి వ్యాఖ్యలను చేయలేదు. అయితే ఎన్టీఆర్ అభిమానులు మరియు రాజమౌళి అభిమానులు మాత్రం కార్యక్రమం రద్దు వెనుక నూటికి నూరు శాతం ప్రభుత్వ పెద్దల హస్తముందని, కేవలం ఎన్టీఆర్ ఇటీవల అమిత్ షాను కలవడం వల్లే ఈ కార్యక్రమాన్ని చివరి నిమిషంలో రద్దు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నెల 25వ తారీకు ఉన్నాయి శ్రేయస్ మీడియా వారు పోలీసులకు ఈ కార్యక్రమం నిర్వహణ యొక్క అనుమతులు తీసుకున్నారు. ఆ సమయంలో అనుమతించి ఇప్పుడు ఎందుకు నిరాకరించారనేది వాళ్లకే తెలియాలి అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది