SS Taman : నా మొదటి జీతం 30 రూపాయలు.. ‘అఖండ’ చూసి బాలకృష్ణ ఏమన్నారంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

SS Taman : నా మొదటి జీతం 30 రూపాయలు.. ‘అఖండ’ చూసి బాలకృష్ణ ఏమన్నారంటే?

SS Taman : తెలుగు చిత్ర పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ పేరు ప్రస్తుతం మారుమోగుతోంది. ఒకప్పుడు దేవీ శ్రీ ప్రసాద్, మణిశర్మల పేర్లు ఇండస్ట్రీల మార్మోగేవి. ప్రస్తుతం వారి స్థానాన్ని థమన్ కబ్జా చేసేశాడు. బాలయ్య బాబు నటించిన అఖండ మూవీతో థమన్ పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.సౌత్ ఇండియాలో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా థమన్ పేరు వినిపిస్తోంది. అగ్రహీరోలకు వారి తనయుల సినిమాలకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఒక్క తెలుగు […]

 Authored By mallesh | The Telugu News | Updated on :23 December 2021,2:20 pm

SS Taman : తెలుగు చిత్ర పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ పేరు ప్రస్తుతం మారుమోగుతోంది. ఒకప్పుడు దేవీ శ్రీ ప్రసాద్, మణిశర్మల పేర్లు ఇండస్ట్రీల మార్మోగేవి. ప్రస్తుతం వారి స్థానాన్ని థమన్ కబ్జా చేసేశాడు. బాలయ్య బాబు నటించిన అఖండ మూవీతో థమన్ పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.సౌత్ ఇండియాలో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా థమన్ పేరు వినిపిస్తోంది. అగ్రహీరోలకు వారి తనయుల సినిమాలకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఒక్క తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ్, కన్నడం, మాళయాలం చిత్రాలకు కూడా థమన్ సంగీతం అందిస్తుండటం గమనార్హం..

తెలుగులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో థమన్ మంచి బ్రేక్ వచ్చింది. అందులోని ‘బుట్టబొమ్మ’ సాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో తెలిసిందే. ఈ పాటను ఏకంగా బాలీవుడ్ ను కూడా షేక్ చేసింది.తెలుగు ఇండస్ట్రీలో థమన్ ప్రస్తుతం చాలా బిజీ అయిపోయారు. అన్ని సినిమా ఇండస్ట్రీల నుంచి వరుస ఆఫర్లు వస్తున్నాయని తెలిసింది. ఈ క్రమంలోనే థమన్ ‘అలీతో స‌ర‌దాగా’ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా విచ్చేసి కాసేపు తన వ్యక్తిగత విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. తన కెరీర్‌లో ఎన్నో ప్లాపులు వచ్చాయని, ఆ టైంలో ఎప్పుడూ కుంగిపోలేదన్నారు. హిట్స్ వచ్చినా కూడా అలానే నిశ్చలంగా ఉంటానని చెప్పుకొచ్చాడు. నిజానికి ప్లాపుల నుంచి ఎంతో నేర్చుకున్నానని చెప్పాడు.

my first salary was 30 rupees said by ss taman

my first salary was 30 rupees said by ss taman

SS Taman : 30 రూపాయలతో థమన్ లైఫ్ స్టార్ట్..

తన ఫస్ట్ మూవీ బాలకృష్ణ హీరోగా నటించిన ‘భైరవద్వీపం’ అని చెప్పాడుథమన్.. అందులో డ్రమ్మర్‌గా పనిచేసినందుకు అప్పట్లో రూ.30 వేతనంగా ఇచ్చారని గుర్తు చేసుకున్నాడు.ఇప్పుడు అదే బాలయ్య బాబు అఖండ సినిమాకు సంగీత దర్శకుడిగా చేయడం చాలా ఆనందంగా ఉందన్నాడు. అఖండ మ్యూజిక్ అవుట్‌ పుట్ చూశాక ‘ఈ సినిమాకు నువ్వు కూడా హీరోవే’ అని బాలయ్య బాబు తనతో అన్నారని థమన్ చెప్పుకొచ్చారు. 30రూపాయల జీతం నుంచి తాను ఈ స్థాయికి చేరుకోవడానికి 20 సంవత్సరాలు పట్టిందని , దీని కోసం ఎంతో శ్రమించానని చెప్పాడు. తనకు ఇళయరాజా గుండె అయితే, ఏఆర్ రెహమాన్ బ్రెయిన్ అని థమన్ చెప్పడం విశేషం..

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది