Home » Entertainment » Mytri Movie Makers Fixed Balakrishna Gopichand Malineni Combo
Entertainment

Balakrishna : బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబో ఫిక్స్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్ ..!

Authored By
vamana sai
The Telugu News | Updated on: February 11, 2021 5:05 pm
Advertisement

Balakrishna : బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ ని ఫిక్స్ చేశారు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. తాజాగా ఉప్పెన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాతలు పలు క్రేజీ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన విషయాలను ప్రకటించారు. ఇందులో భాగంగా మైత్రీ వారు .. బాలకృష్ణ తో సినిమా నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ సినిమా చేస్తున్నాడు. సింహ, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలయ్య – బోయపాటి శ్రీను కాంబోలో రూపొందుతున్న ఈ హ్యాట్రిక్ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలయ్య కి జంటగా ప్రగ్యా జైస్వాల్ – పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Advertisement

mytri-movie-makers-fixed-balakrishna-gopichand-malineni-combo

ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో బాలయ్య తో ద్విపాత్రభినయం చేయిస్తున్నట్టు బోయపాటి శ్రీను వెల్లడించాడు. పక్కా మాస్ యాక్షన్ అండ్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా మే 28 న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రీసెంట్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ అధికారకంగా ప్రకటించారు కూడా. దాంతో ఈ సినిమా తర్వాత బాలయ్య చేయబోయో దర్శకుడు.. కథ గురించి ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి.

Advertisement

Balakrishna : ఈ న్యూస్ బాలయ్య ఫ్యాన్స్ కి భారీ సర్‌ప్రైజ్ ని ఇచ్చింది.

ఈ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి తాజాగా బాలకృష్ణ తర్వాత సినిమా తమ సంస్థలో నిర్మిస్తున్నామని వెల్లడించారు. రీసెంట్ గా క్రాక్ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడంటు.. బాలయ్య – బోయపాటి శ్రీను సినిమా రిలీజ్ కాగానే ఈ సినిమా సెట్స్ మీదకి రానుందని ప్రకటించారు. ఈ న్యూస్ బాలయ్య ఫ్యాన్స్ కి భారీ సర్‌ప్రైజ్ ని ఇచ్చింది. ఇక ఈ సినిమా భారీ యాక్షన్ సినిమాగా రూపొందనుందని సమాచారం.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి