Game Changer: సినిమాలో మిస్ అయిన ‘నానా హైరానా’ పాట.. ఎప్ప‌టి నుండి అందుబాటులోకి వ‌స్తుందంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Game Changer: సినిమాలో మిస్ అయిన ‘నానా హైరానా’ పాట.. ఎప్ప‌టి నుండి అందుబాటులోకి వ‌స్తుందంటే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :10 January 2025,11:23 am

ప్రధానాంశాలు:

  •  Game Changer: సినిమాలో మిస్ అయిన ‘నానా హైరానా’ పాట.. ఎప్ప‌టి నుండి అందుబాటులోకి వ‌స్తుందంటే..!

Game Changer: ఒకవైపు నార్త్ ఇండియాలో హీరో అల్లు అర్జున్ తెలుగు సినిమా ‘పుష్ప 2’  Pushpa 2ర‌చ్చ చేస్తుండ‌గానే, ఇప్పుడు మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ చిత్రంతో బ‌రిలోకి దిగాడు. ఈరోజు భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి, ఇతర హీరోల అభిమానుల నుండి పర్వాలేదు అనే టాక్ వినిపిస్తున్నా.. మెగా అభిమానులు మాత్రం ఈ సినిమాను బాగా ఇష్టపడుతున్నారు.

Game Changer సినిమాలో మిస్ అయిన నానా హైరానా పాట ఎప్ప‌టి నుండి అందుబాటులోకి వ‌స్తుందంటే

Game Changer: సినిమాలో మిస్ అయిన ‘నానా హైరానా’ పాట.. ఎప్ప‌టి నుండి అందుబాటులోకి వ‌స్తుందంటే..!

Game Changer ఎలా మిస్ అయింది..

ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘గేమ్ ఛేంజర్’ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ రాబడుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా విజువల్ వండర్ గా ఉండబోతుందని ముందుగానే మేకర్స్ ‘నానా హైరానా’ Naana hairaanaపాట గురించి చెప్పి ఊరించారు. దీంతో సినిమాలో ఈ పాట ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన అభిమానులకు నిరాశ ఎదురైంది.

ఈ రొమాంటిక్ సాంగ్ అద్భుతంగా ఉండబోతుందని శంకర్ shankar ముందుగానే చెప్పేశారు. తెరపై చూస్తున్నంత సేపు వేరే లోకంలో ఉన్నామా? అన్న లెవెల్ లో ఈ పాటను డిజైన్ చేశామని ప్రమోషన్స్ లో వెల్లడించారు. కానీ తాజాగా ఈ పాట థియేటర్లలో కనిపించక‌పోవ‌డానికి కారణం మూవీకి ఎదురైన సాంకేతిక సమస్యలే అని అంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ పాటను జనవరి 14 నుంచి థియేట్రికల్ వర్షన్ కి యాడ్ చేయబోతున్నారు. ఈ మేరకు చిత్ర బృందం ఇప్పటికే పని చేస్తున్నట్టు సమాచారం. ఇండియాలోనే తొలిసారిగా ఇన్ ఫ్రారెడ్ కెమెరా వాడి షూట్ చేసిన సాంగ్ అని చెబుతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది