నభా నటేష్ కి నితిన్ హిట్ ఇవ్వకపోతే ఆ లిస్ట్ లో చేర్చేస్తారట ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

నభా నటేష్ కి నితిన్ హిట్ ఇవ్వకపోతే ఆ లిస్ట్ లో చేర్చేస్తారట ..?

నభా నటేష్ .. ఇస్మార్ట్ శంకర్ తర్వాత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ భావించారు. కాని ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుందేమో అని టాక్ మొదలైంది. నభా నటేష్ లాంటి హాట్ బ్యూటీకి సరైన బ్లాక్ బస్టర్ పడాలేగాని వరసగా యంగ్ హీరోల సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారి కొంతకాలం టాలీవుడ్ ని ఏలుతుంది. కాని లక్ కలిసి రాకపోతే మాత్రం నెటిజన్స్ తో రక రకాల కామెంట్స్ వినాల్సి వస్తుంది. […]

 Authored By govind | The Telugu News | Updated on :4 January 2021,9:15 am

నభా నటేష్ .. ఇస్మార్ట్ శంకర్ తర్వాత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ భావించారు. కాని ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుందేమో అని టాక్ మొదలైంది. నభా నటేష్ లాంటి హాట్ బ్యూటీకి సరైన బ్లాక్ బస్టర్ పడాలేగాని వరసగా యంగ్ హీరోల సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారి కొంతకాలం టాలీవుడ్ ని ఏలుతుంది. కాని లక్ కలిసి రాకపోతే మాత్రం నెటిజన్స్ తో రక రకాల కామెంట్స్ వినాల్సి వస్తుంది. ప్రస్తుతం నభా నటేష్ పరిస్థితి అదేనేమో అని కామెంట్స్ మొదలయ్యాయని అంటున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మాస్ హిట్ అందుకున్న నభా నటేష్ కి ఆ సినిమా క్రెడిట్ మాత్రం అంతగా దక్కలేదు.

Smart Shankar Mp3 Songs Download in High Definition [HD] - QuirkyByte

సినిమా సక్సస్ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ పూరి జగన్నాధ్, హీరో రాం కే వెళ్ళిపోయింది. ఇక ఈ సినిమా సక్సస్ తర్వాత నభా నటేష్ కి మాస్ మహారాజ రవితేజ్ తో డిస్కోరాజా సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఈ సినిమా గనక బ్లాక్ బస్టర్ అయి ఉంటే ఇక నభా నటేష్ ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి ఉండేది కాదేమో. కాని అనూహ్యంగా నభా నటేష్ ఎన్నో అంచనాలు పెట్టుకుని చేసిన డిస్కోరాజా డిజాస్టర్ గా నిలిచి షాకిచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత మెగా హీరో సాయి ధరం తేజ్ సరసన సోలో బ్రతుకే సో బెటర్ అన్న సినిమా చేసింది.

Alludu Adhurs: Hola Chica lyrical: Bellamkonda Sreenivas, Nabha Natesh

లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ లో రిలీజైన ఫస్ట్ సినిమాగా సోలో బ్రతుకే సో బెటర్ మీద అందరి దృష్టి పడింది. ఈ సినిమా హిట్ అయితే అయినా నభా నటేష్ స్టార్ తిరుగుతుందని భావించారు. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా కూడా నభా నటేష్ గురుంచి మాట్లాడుకునే వాళ్ళు కరువయ్యారు. ఈ సినిమా క్రెడిట్ మొత్తం సాయి ధరం తేజ్ కే వెళ్ళిపోయింది. ఇక త్వరలో రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ నభా నటేష్ కి ఎలాంటి సక్సస్ ని ఇస్తుందో చూడాలి. అయితే ఇప్పుడు నభా నటేష్ నటిస్తున్న నితిన్ సినిమా మీదే ఆశలన్ని పెట్టుకుందట. ఈ సినిమా తో గనక నభా నటేష్ కి పేరు రాకపోతే ఇక ఈ హాట్ బ్యూటీ ని ఐరెన్ లెగ్ హీరోయిన్స్ లిస్ట్ లో చేర్చేస్తారని చెప్పుకుంటున్నారు.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది