Naga Babu : జెండా మార్చిన నాగబాబు.. గ్యాంగుతో సహా జంప్
Naga Babu : నాగబాబు తన గ్యాంగుతో కలిసి అక్కడికి ఇక్కడకు జంప్ అవుతున్నాడు. జబర్దస్త్ షోలో ఉన్నంత కాలం నాగబాబుదే అంతా నడిచింది. అక్కడి కంటెస్టెంట్లు సైతం నాగబాబు మాటలనే వినేవారు. నమ్మేవారు. అతను చెప్పిందే చేసేవారు. అయితే జబర్దస్త్ నుంచి నాగబాబు బయటకు రావడం అప్పట్లో ఓ సంచలనం.నాగబాబు బయటకు వచ్చింది కూడా అక్కడి దర్శకులైన నితిన్ భరత్‌ల కోసమే. ఆ ఇద్దరూ బయటకు రావాలని ఫిక్స్ అవ్వడంతో, వారికి అండగా ఉండేందుకే నాగబాబు బయటకు వచ్చాడట.
ఈ విషయాలన్నీ తరువాత కొన్ని వీడియోల రూపంలో నాగబాబు చెప్పేశాడు. అయితే తాను వెళ్లడమే కాకుండా తన అనునాయిలను కూడా తీసుకెళ్లాడు.అందులో కొందరు ఇప్పటికీ నాగబాబుతోనే ఉన్నారు. ఇంకొందరు మాత్రం జబర్దస్త్ షోను విడిచి రాలేకపోయారు. అయితే నాగబాబు మాత్రం అక్కడా ఇక్కడా అంటూ తిరుగుతూనే ఉన్నాడు. జీ తెలుగులో అదిరింది, బొమ్మ అదిరింది అంటూ కొన్ని షోలు చేశారు. అందులో నాగబాబు హల్చల్ చేశాడు. అయితే అందులో మరీ ఎక్కువగా సీఎంను టార్గెట్ చేస్తూ స్కిట్లు వేసేవారు.

Naga Babu And His Team In Gemini TV Ugadi 2022 Fyll Kickku Event
దీంతో ఆ షోనే రద్దైంది. అలా నాగబాబు మొత్తానికి బుల్లితెరకు దూరంగా ఉండిపోయాడు. ఆ సమయంలో తన గ్యాంగు మొత్తానికి కామెడీ స్టార్స్ అనే షోను సెట్ చేసినట్టున్నాడు. అయితే ఇప్పుడు అందులో కొందరున్నారు. కొందరు వెళ్లిపోయారు. మళ్లీ ఇప్పుడు నాగబాబు కామెడీ స్టార్స్‌లోకి వచ్చారు. మళ్లీ పాత గ్యాంగు అంతా కూడా దిగింది.కానీ ఈ ఉగాది ఈవెంట్ కోసం మళ్లీ వీళ్లంతా కూడా జెమినీ టీవీకి జంప్ అయ్యారు. మళ్లీ నాగబాబు జెండా మార్చేశాడు. ఈ ఉగాది ఈవెంట్ కోసం జెమినీ టీవీ ఫుల్ కిక్కు అనే ప్రోగ్రాంను చేసింది. ఇందులో నాగబాబు అండ్ కో సందడి చేసింది.
Shadruchulu ante ento chudandi!
Full kickku | 2nd April | 5 PM#UgadiWithGeminiTV#GeminiTV#Anasuya #Nagababu pic.twitter.com/sA6iG30OQm— Gemini TV (@GeminiTV) April 1, 2022