Naga Chaitanya : ఈ క్షణాన్ని ఎప్పుడు మర్చిపోను.. నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టకుంటానంటున్న నాగ చైతన్య!

Authored By mallesh | The Telugu News | Published on: September 26, 2022, 8:00 pm

Naga Chaitanya : అక్కినేని నటవారసుడు నాగచైతన్య గత కొంతకాలంగా చాలా సైలెంట్ అయ్యాడు. ఆయన వ్యక్తిగత జీవితంతో పాటు సినీ జీవితం కూడా పెద్దగా ఆశించిన మేర ఫలితాలను ఇవ్వడం లేదని బాధలో ఉన్నట్టు తెలుస్తోంది. సమంతతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి చైతూకు పెద్దగా కలిసి రావడం లేదట..నటించిన సినిమాలు సరిగా ఆడకపోవడం ఒకటైతే ఎక్కడకు వెళ్లినా సామ్ గురించి అడిగి చైతూను ఇబ్బందులకు గురిచేస్తున్నారట..

Naga Chaitanya : చైతూ సామ్‌ను ఇంకా మర్చిపోలేదా..

నాగచైతన్య సమంత విడపోయి వచ్చే అక్టోబర్‌కు ఏడాది అవుతుంది. సామ్ తన జీవితంలో ఉన్నపుడు సంతోషంగా కనిపించిన చైతూ ప్రస్తుతం దిగాలు పడిపోయినట్టు కనిపిస్తోంది. అప్పట్లో అతను నటించిన సినిమాలు కూడా హిట్ అయ్యాయి. దానికి తోడు సామ్ పక్కనే ఉండటంతో వీరిద్దరూ ఖాళీ టైం దొరికినప్పుడల్లా విహారయాత్రలకు వెళ్లి వచ్చేవారు. ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారు. సమంత తన లైఫ్‌లో బిజీగా మారిపోయింది. షూటింగ్స్ బిజీతో చెన్నయ్, హైదరాబాద్, ముంబై తిరుగుతోంది. మొన్నటివరకు టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలకే పరిమితమైన సామ్.. త్వరలో బాలీవుడ్, హాలీవుడ్ స్క్రీన్ మీద కూడా కనిపించనున్నట్టు తెలుస్తోంది.

Naga Chaitanya about his movie love story

Naga Chaitanya about his movie love story

సామ్ వరుస విజయాలతో దూకుడు మీదుంటే చైతూ మాత్రం ఎందుకో వెనకబడిపోయాడు. ఈ ఏడాది అతను నటించిన లాల్ సింగ్ చద్దా, థాంక్యూ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమా మాత్రమే నాగ చైతన్య లాస్ట్ హిట్ సినిమా. ఇది విడుదలై ఏడాది కావొస్తుండటంతో నాగచైతన్య ట్వీట్ చేశాడు.‘ఇలాంటి ప్రత్యేకమైన చిత్రాన్ని నాకు అందించిన చిత్ర యూనిట్‌కు, దీనిని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ మూవీ నాకు ఎన్నో విషయాలను నేర్పించింది. లవ్ స్టోరీ జ్ఞాపకాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను’ అని చెప్పాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp