Naga Chaitanya : అక్కినేని నటవారసుడు నాగచైతన్య గత కొంతకాలంగా చాలా సైలెంట్ అయ్యాడు. ఆయన వ్యక్తిగత జీవితంతో పాటు సినీ జీవితం కూడా పెద్దగా ఆశించిన మేర ఫలితాలను ఇవ్వడం లేదని బాధలో ఉన్నట్టు తెలుస్తోంది. సమంతతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి చైతూకు పెద్దగా కలిసి రావడం లేదట..నటించిన సినిమాలు సరిగా ఆడకపోవడం ఒకటైతే ఎక్కడకు వెళ్లినా సామ్ గురించి అడిగి చైతూను ఇబ్బందులకు గురిచేస్తున్నారట..
నాగచైతన్య సమంత విడపోయి వచ్చే అక్టోబర్‌కు ఏడాది అవుతుంది. సామ్ తన జీవితంలో ఉన్నపుడు సంతోషంగా కనిపించిన చైతూ ప్రస్తుతం దిగాలు పడిపోయినట్టు కనిపిస్తోంది. అప్పట్లో అతను నటించిన సినిమాలు కూడా హిట్ అయ్యాయి. దానికి తోడు సామ్ పక్కనే ఉండటంతో వీరిద్దరూ ఖాళీ టైం దొరికినప్పుడల్లా విహారయాత్రలకు వెళ్లి వచ్చేవారు. ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారు. సమంత తన లైఫ్‌లో బిజీగా మారిపోయింది. షూటింగ్స్ బిజీతో చెన్నయ్, హైదరాబాద్, ముంబై తిరుగుతోంది. మొన్నటివరకు టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలకే పరిమితమైన సామ్.. త్వరలో బాలీవుడ్, హాలీవుడ్ స్క్రీన్ మీద కూడా కనిపించనున్నట్టు తెలుస్తోంది.
సామ్ వరుస విజయాలతో దూకుడు మీదుంటే చైతూ మాత్రం ఎందుకో వెనకబడిపోయాడు. ఈ ఏడాది అతను నటించిన లాల్ సింగ్ చద్దా, థాంక్యూ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమా మాత్రమే నాగ చైతన్య లాస్ట్ హిట్ సినిమా. ఇది విడుదలై ఏడాది కావొస్తుండటంతో నాగచైతన్య ట్వీట్ చేశాడు.‘ఇలాంటి ప్రత్యేకమైన చిత్రాన్ని నాకు అందించిన చిత్ర యూనిట్‌కు, దీనిని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ మూవీ నాకు ఎన్నో విషయాలను నేర్పించింది. లవ్ స్టోరీ జ్ఞాపకాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను’ అని చెప్పాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Dry Lips : చలికాలం వచ్చింది అంటే చాలు చర్మ సమస్యలు మొదలైనట్లే. ఇతర సీజన్ కంటే చలికాలం అంటే ఆడవాళ్లకు…
Allu Arjun : ప్రముఖ ఓటీటీ OTT ప్లాట్ ఫామ్ ఆహాలో Aha నందమూరి బాలకృష్ణ N Balakrishna అన్స్టాపబుల్ …
Legs Arms : సూర్యకాంతి విటమిన్ డీ కి ముఖ్య మూలం అని చెప్పొచ్చు. అయితే విటమిన్ డీ లోపం ఉన్నవారు…
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
This website uses cookies.