
Minister Roja Faces Humiliation On Etv Mallemala Dasara Vaibhavam Event
Roja : బుల్లితెరపై రోజాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెరపై జబర్దస్త్ జడ్జ్‌గా రోజాకు తిరుగులేని ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే ఇప్పుడు రోజాకు మంత్రిగా పదవి దక్కడంతో.. జబర్దస్త్ షోను మానేసింది. జబర్దస్త్ జడ్జ్‌గా మానేసి.. మంత్రిగా పూర్తి స్థాయిలో ప్రజల మధ్యలోకి వెళ్లింది. అయితే రోజా ఇప్పుడు మళ్లీ ముఖ్య అతిథిగా స్పెషల్ ఈవెంట్‌కు వచ్చింది. దసరా కోసం మల్లెమాల నిర్వహిస్తోన్న దసరా వైభవం ఈవెంట్‌లో రోజా మెరిసింది. లేడీ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పేశారు. ఇక రోజా ఈ ప్రోమోలో అదరగొట్టేసింది. ప్రోమో అంతా కూడా రోజానే హైలెట్ అయింది.
ఇక ప్రోమో చివర్లో ప్రమోషనల్ స్టంట్స్ అదిరిపోయాయి. ఇలాంటి ప్రోమో స్టంట్లు ఇది వరకే మనం ఎన్నో చూశాం. ఇలా ప్రోమో చివర్లో ఏదో ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసేందుకు మల్లెమాల డైరెక్షన్ టీం బాగానే ప్లాన్లు వేస్తుంటుంది. ప్రోమోల్లో ఉండేంత కంటెంట్ గానీ పసగానీ ఎపిసోడ్‌లో ఉండదని అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు కూడా ఇలాంటి పాచిపోయిన స్ట్రాటజీలతోనే ప్రోమోను కట్ చేశారు. ప్రోమో చివర్లో.. రోజా బాగానే నటించింది. పిలిచి అవమానిస్తున్నారా? అంటూ రోజా తనకు వేసిన మాలను విసిరి పారేసింది. నూకరాజు ఏదో ఒక సెటైర్ వేసినట్టున్నాడు. దానిపై రోజా హర్ట్ అయినట్టుంది. కావాలనే ఇలా చేశారా? అంటూ రోజా అనేసింది.
Minister Roja Faces Humiliation On Etv Mallemala Dasara Vaibhavam Event
వాడు కూడా అదే అంటున్నాడు? అని ఆది ఏదో కవర్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ రోజా మాత్రం నటించడంలో మరింత జీవించేసింది. ఇక స్టేజ్ మీద నుంచి వెళ్లిపోతోన్నట్టుగా నడుచుకుంటూ ముందుకు పోయింది. దీంతో స్టేజ్ మీద ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు. అలా రోజా అలిగి వెళ్లిపోతోండటం.. నూకరాజు, ఆది గుండెల్లో గుబులు పుట్టినట్టుగా చూపించారు. ప్రోమోలో ఇంత కంటెంట్ ఉంది. కానీ ఎపిసోడ్‌లో మాత్రం ఇదంతా ఊరికే చేసినట్టుగా ఉంటుంది. ఇలాంటివి ఎన్ని చూడలేదు అంటూ జనాలు ఈ ప్రోమోను లైట్ తీసుకుంటున్నారు. అసలేం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
This website uses cookies.