Naga Chaitanya : అంచ‌నా త‌ప్పింది… పాత విష‌యాల‌పై నాగ చైత‌న్య ఆస‌క్తిక‌ర కామెంట్స్

Authored By Sam C | The Telugu News | Published on: July 19, 2022, 9:38 pm

Naga Chaitanya : విడాకుల విష‌యం ద‌గ్గ‌ర నుండి స‌మంత‌- నాగ చైత‌న్యకు సంబంధించిన ఏ విష‌యం అయిన నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తుంది. స‌మంత‌ని ఎంతో ప్రాణంగా ప్రేమించి చివ‌రికి ఆమెకు విడాకులు ఇవ్వ‌డం చైతూకే కాదు అభిమానుల‌కి కూడా ఏ మాత్రం మింగుడు ప‌డ‌డం లేదు. అయితే తాజాగా ఆయ‌న ఎదుర్కొన్న బ్యాడ్ ఎక్స్‌పీరియెన్‌సెస్ గురించి చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలో త‌న‌కు జ‌డ్జ్‌మెంట్ లేక‌పోవ‌టం వ‌ల్ల‌నే త‌ప్పు జ‌రిగింద‌ని ఆయ‌న తెలిపారు. నాగ చైత‌న్య హీరోగా విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘థాంక్యూ’. విక్రమ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జూలై 22న రిలీజ్ అవుతుంది.

ఈ సినిమా రిలీజ్ సంద‌ర్భంగా మాట్లాడిన నాగ చైత‌న్య కొత్త ద‌ర్శ‌కుల‌తో పెద్దగా ప‌ని చేయ‌టం లేదు అని ప్ర‌శ్న వ‌చ్చిన‌ప్పుడు .. ‘‘నేను డైరెక్ట‌ర్స్‌ని బాగా న‌మ్ముతాను. డైరెక్ట‌ర్ ఎంత బాగా చెబితే అంత బాగా న‌టిస్తాను. ఆడియెన్స్ న‌న్ను ల‌వ్ స్టోరీస్‌, ఎమోష‌న‌ల్ జ‌ర్నీస్ సినిమాల‌తో ఎంక‌రేజ్ చేశారు. దాంతో క‌మ‌ర్షియ‌ల్ ఫార్మేట్‌కు సూట్ అవుతానా అనే సందేహం ఉంటుంది. కొత్త దర్శకులతో ఇంత‌కు ముందు చేశాను. కానీ బ్యాడ్ ఎక్స్‌పీరియెన్‌సెస్ ఎదుర‌య్యాయి. అలాగ‌ని వారిది త‌ప్ప‌ని నేను అన‌లేను. నా సెల‌క్ష‌న్‌లో కూడా లోపం ఉండొచ్చు’’ అన్నారు.

naga chaitanya intresting comments viral

naga chaitanya intresting comments viral

Naga Chaitanya : చైతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఇటీవల `లవ్‌ స్టోరి`, `బంగార్రాజు` చిత్రాలతో బ్యాక్‌ టూ బ్యాక్‌ ఆకట్టుకున్నారు నాగచైతన్య . వరుస విజయాల అనంతరం ఇప్పుడాయన `థ్యాంక్యూ` చిత్రంతో రాబోతున్నారు. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశీ ఖన్నా కథానాయికగా నటించింది. దిల్‌ రాజు నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 22న విడుదలైంది. చిత్ర ప్రమోషన్‌ లో భాగంగా నాగచైతన్యతో మాట్లాడుతూ, తమ్ముడు అఖిల్‌ గురించి కూడా స్పందించారు . ఏజ్‌లో ఆరేడు ఏళ్లు గ్యాప్‌ ఉందని, దీంతో ఆలోచనలు భిన్నంగా ఉంటాయన్నారు. తనకు ఆలోచన విధానం, అఖిల్‌ ది పూర్తి భిన్నంగా ఉంటుందని, అందుకే కథల విషయంలో చర్చించుకుంటామని తెలిపారు చైతూ.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp