Naga Chaitanya : నాగ చైత‌న్యకు దారుణ‌మైన ప‌రిస్థితి.. మ‌రి ఇంత దిగ‌జార్చారేం..!

Authored By Sam C | The Telugu News | Updated on: July 25, 2022, 11:49 pm

Naga Chaitanya : టాలీవుడ్ పాపుల‌ర్ హీరోల‌లో నాగ చైత‌న్య ఒక‌రు. ఆయ‌న న‌టించిన ల‌వ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాలు మంచి విజ‌యం సాధించాయి. ఈ నేప‌థ్యంలో చైతూ త‌ర్వాతి చిత్రంపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. రీసెంట్‌గా థ్యాంక్యూ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. మార్నింగ్ షోకే ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చేసింది. నాగ చైతన్య కెరీర్ లో అతి తక్కువ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా థాంక్యూ నిలిచింది తన ఎదుగుదలకు కారణమైన వారికి కృత‌జ్ఞ‌త‌ చెబుతూ ఓ యువకుడు సాగించి జర్నీ కథగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల లో విడుదలైన భారీ చిత్రాల్లో థాంక్యూ ఒకటి కావడంతో నాగచైతన్య సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే దారుణమైన నిరాశ మిగిల్చింది.

లీజ్ రోజు నుంచి చాలా డల్ మౌత్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. కలెక్షన్లు కూడా ఆశించిన స్థాయిలో ఈ సినిమాకి రాలేదు. మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం 3.5 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని చాలా థియేటర్లలో నుంచి ఈ సినిమాని తీసేశారు. చైతు – దిల్ రాజు మరియు విక్రమ్ కుమార్ సినీ కెరీర్‌లలోనే ఈ చిత్రం అతిపెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. అందుకే, ఈ సినిమా డిజాస్టర్స్ లిస్ట్ లో కూడా ప్లేస్ సంపాదించింది. సక్సెస్ కి చిరునామా అన్నంత పేరున్న నిర్మాత దిల్ రాజు నుంచి ఈ సినిమా వస్తోందని ఊహించలేదు అంటూ నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు.

Naga Chaitanya is in dire straits

Naga Chaitanya is in dire straits

Naga Chaitanya : ఇంత దారుణంగానా..

ఇక నాగ చైతన్య నటించిన రీసెంట్ మూవీస్ అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ ని అందుకుని లాంగ్ రన్ లో ఒకటి తర్వాత ఒకటి వరుస పెట్టి సక్సెస్ లుగా నిలిచాయి. కానీ ఆ ఇంపాక్ట్ ఏమి కూడా థాంక్యూ సినిమా మీద పడలేదు… సినిమాకి అనుకున్న రేంజ్ లో బజ్ ఏర్పడలేదు. దానికి తోడూ రిలీజ్ రోజు వర్షాల ఇంపాక్ట్ కూడా పడింది. దాతో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ నుండి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ వరకు కూడా ఏవి లేవు. రీసెంట్ టైమ్ లో నాగ చైతన్య కెరీర్ లోనే లో వరస్ట్ ఓపెనింగ్స్ ఇప్పుడు సినిమా సొంతం చేసుకుంది.దిల్ రాజు నిర్మించిన జోష్ సినిమాతోనే నాగ‌చైత‌న్య హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సుదీర్ఘ విరామం త‌ర్వాత మ‌ళ్లీ దిల్‌రాజు సంస్థ‌లో నాగ‌చైత‌న్య చేసిన సినిమా ఇది. ఇందులో రాశీఖ‌న్నా, మాళ‌వికానాయ‌ర్‌, అవికాగోర్ హీరోయిన్లుగా న‌టించారు.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp