Naga Chaitanya : మరో అమ్మాయితో ప్రేమలో పడ్డ నాగ చైతన్య.. తను స్టార్ హీరోయిన్.. ఎవరో తెలిస్తే నోరెళ్లబెడతారు

Authored By Jagadesh Gatla | The Telugu News | Updated on : 31 December 2021, 11:30 am

Naga Chaitanya : నాగ చైతన్య అని అనగానే మనకు గుర్తొచ్చే మరో పేరు సమంత. టాలీవుడ్ లోనే వీళ్లది క్రేజీ జంట. కానీ.. ఇద్దరి మధ్య ఏమైందో కానీ.. ఇద్దరూ ఇటీవలే విడిపోయారు. ఏమాయ చేశావే సినిమాతోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. చాలా ఏళ్ల పాటు ప్రేమించుకొని ఆ తర్వాత కొన్నేళ్లు రిలేషన షిప్ లో ఉండి చివరకు పెద్దల అంగీకారంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నేళ్లు వీళ్ల సంసారం సాఫీగానే జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. సడెన్ గి ఇద్దరూ విడాకులు తీసేసుకున్నారు.టాలీవుడ్ మొత్తం వీళ్ల విడాకులు పెద్ద సంచలనం సృష్టించాయి.

ఈ క్రేజీ కపుల్ ఇంత త్వరగా విడిపోతారని ఎవ్వరూ అనుకోలేదు. మరోవైపు నాగార్జున కుటుంబం అంటేనే ఇండస్ట్రీలో చాలా పెద్ద కుటుంబం. అటువంటి కుటుంబం ఇటువంటి చిక్కుల్లో చిక్కుకుపోవడంతో చాలామంది సినీ అభిమానులతో పాటు సినీ పెద్దలు కూడా ఈ విషయంపై స్పందించలేకపోయారు.విడాకుల తర్వాత ఇద్దరం మంచి ఫ్రెండ్స్ గా ఉంటాం అని ఇద్దరూ చెప్పుకున్నారు కానీ.. ఇద్దరిలో ఆ ఫ్రెండ్ షిప్ అయితే మళ్లీ కనిపించడం లేదు. చివరకు నాగ చైతన్య పుట్టిన రోజుకు కూడా సమంత విషెస్ చెప్పలేదు. అంటే.. ఇద్దరి మధ్య ఎన్ని మనస్పర్థలు వచ్చాయో అర్థం చేసుకోవచ్చు.

naga chaitanya new after krithi shetty

naga chaitanya new after krithi shetty

Naga Chaitanya : విడాకుల తర్వాత నాగ చైతన్య మరో అమ్మాయిని చూసుకున్నాడా?

మరోవైపు నాగ చైతన్య కూడా సమంతను పూర్తిగా మరిచిపోయాడని.. తను ఇప్పుడు మరో అమ్మాయి ప్రేమలో పడ్డాడని టాలీవుడ్ కోడై కూస్తోంది. అయితే.. ఆ అమ్మాయి ఎవరు.. అనే కదా మీ డౌట్. తను ఎవరో కాదు. మన బేబమ్మ. ఉప్పెన సినిమాతో కుర్రకారు గుండెల్లో గుబులు లేపిన కృతి శెట్టే.. ఇప్పుడు నాగ చైతన్య మనసును కూడా దోచేసుకుందట.

బంగార్రాజు సినిమాలో కృతి శెట్టి.. నాగ చైతన్య సరసన నటించిన విషయం తెలిసిందే. అయితే.. ఇద్దరూ షూటింగ్ సమయంలో చాలా క్లోజ్ గా ఉన్నారట. ఇద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. అంటే.. సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య కృతి శెట్టితో ప్రేమలో పడ్డాడా అనే వార్తలు ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్ లో గుప్పుమంటున్నాయి.

కృతి శెట్టి కూడా చైతూతో సినిమా షూటింగ్ సమయంలో కాస్త క్లోజ్ గానే మూవ్ అయిందట. నాగ చైతన్య.. సమంతను పూర్తిగా మరిచిపోయి.. ఫ్రెష్ గా ప్రేమలో పడ్డాడా. ఒకవేళ ప్రేమలో పడితే ఆ ప్రేమ ఎంతదూరం వెళ్తుందో చూడాలి మరి.

Advertisement

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి