Naga Chaitanya : ప్ర‌భాస్‌కి ఝ‌ల‌క్ ఇచ్చిన నాగ చైత‌న్య‌.. ఏ విష‌యంలోనో తెలుసా?

Authored By Sam C | The Telugu News | Published on: February 15, 2022, 8:30 pm

Naga Chaitanya : బాహుబ‌లి చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ ప్ర‌స్తుతం బ‌డా చిత్రాలే చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఆయ‌న చేస్తున్న రాధే శ్యామ్ గ‌త కొన్నేళ్లుగా సెట్స్ పైనే ఉంది. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు డార్లింగ్ అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై అటు బాలీవుడ్‌తో పాటు ఇండియన్ సినిమా ఇండ‌స్ట్రీ దృష్టి ప‌డింది. మార్చి 11న చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. ఇక ఆయ‌న న‌టిస్తున్న మ‌రో చిత్రం ఆదిపురుష్‌. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నారు.

సీతగా కృతి సనన్ రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. గ్రాఫిక్స్ కి అత్యంత ప్రాధాన్యత వున్న ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమా ఆగ‌స్ట్ 11న విడుద‌ల కానుంద‌ని అంద‌రు ఎదురు చూస్తుండ‌గా, తాజాగా పెద్ద షాక్ ఇచ్చారు లాల్ సింగ్ చ‌ద్దాటీం. బాలీవుడ్‌ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా చిత్రాన్ని ఏప్రిల్ 14, 2022న థియేటర్లలోకి తీసుకు రావాల‌ని అనుకున్నారు. కాని ఈ చిత్రం ప‌నులు పూర్తి కాని నేప‌థ్యంలో ఆగ‌స్ట్ 11కి వాయిదా వేశారు.లాల్ సింగ్ చ‌ద్దా వ‌స్తున్న నేప‌థ్యంలో అంద‌రు ఆదిపురుష్ చిత్రం వాయిద ప‌డ్డ‌ట్టేన‌ని ఫిక్స్ అయ్యారు.

prabhas adipurush postponed

prabhas adipurush postponed

Naga Chaitanya : మళ్లీ వాయిదా..!

ఈ సినిమా తిరిగి ఎప్పుడు కొత్త విడుద‌ల తేదీతో వ‌స్తుందో అని అంద‌రు ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. కాగా, లాల్ సింగ్ చద్దా చిత్రం టామ్ హాంక్స్ నటించిన 1994 హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ఫారెస్ట్ గంప్‌’కి రీమేక్. ఇంతకుముందు అమీర్‌తో కలిసి ‘సీక్రెట్ సూపర్‌స్టార్‌’ (2017) తీసిన అద్వైత్‌ చందన్‌ ఈ హిందీ వెర్షన్‌కు దర్శకత‍్వం వహించారు. ఈ సినిమా అమీర్‌ ఖాన్ ప్రొడక్షన్స్‌లో బ్యానర్‌లో రానుంది. అమీర్‌ ఖాన్‌, కరీనా కపూర్‌తో ఉన్న కొత్త పోస్టర్‌ను ట్విటర్‌లో షేర్‌ చేసింది ప్రొడక్షన్‌ బ్యానర్‌. ఇందులో నాగ చైత‌న్య కూడా ముఖ్య పాత్ర పోషించారు.

Sam C

No bio available for this author.

  1. "Bathing Dinner : భోజనం చేసిన వెంటనే వేడి నీటితో స్నానం చేస్తే ఏమవుతుంది? నిజం ఇదే"

  2. "Radhika Apte : 41 ఏళ్లలోనే నా శరీరం, కోరికలపై అసలైన క్లారిటీ వచ్చింది: రాధికా ఆప్టే"

  3. "Yanamala Krishnudu : టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట జనసేనలోకి మాజీ ప్రత్యర్థులు.. కాకినాడ రాజకీయాల్లో కొత్త లెక్కలు"

  4. "Vangaveeti Ranga Statue : వంగవీటి రంగా విగ్రహం చుట్టూ ముదురుతున్న రచ్చ.. జనసేన-వైసీపీ మధ్య మైండ్‌గేమ్స్..!"

  5. "Dada Movie : బాలయ్య ‘దాదా’ టీమ్‌కు డెడ్‌లైన్ టెన్షన్.. డిసెంబర్ రిలీజ్ కష్టమేనా..?"

  6. "Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్ వేళ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. జీహెచ్ఎంసీపై జెండా పాతేందుకు భారీ వ్యూహం..!"

  7. "The Paradise Movie : నాని ‘ది ప్యారడైజ్’ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఫిదా.. బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమా?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp