Naga Chaitanya – Samantha : వెంట్రుకలు నిక్కబొడుచుకునే బ్రేకింగ్ న్యూస్.. మళ్ళీ కలవబోతోన్న నాగ చైతన్య , సమంత..!!

Authored By Breaking News 2 | The Telugu News | Updated on: January 10, 2023, 7:07 pm

Naga Chaitanya – Samantha : ఈ ప్రపంచంలో ఎవ్వరి మధ్యా ఉండని గొడవలు కేవలం భార్యాభర్తల మధ్యే ఉంటాయి. దానికి కారణం ఏంటో కూడా మీకు తెలుసు. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా గొడవ పడేది భార్యాభర్తలే. వాళ్ల మధ్య బంధం బలపడటానికి కూడా కారణం గొడవలే. ఇద్దరూ ఎప్పుడు చిర్రుబుర్రులాడుతూ ఉంటారు. కొందరి మధ్య గొడవలు సీరియస్ గా మారుతాయి. చివరకు అవి విడాకుల వరకూ వెళ్తాయి. పెద్దలు చెప్పినా వినరు.. కుటుంబ సభ్యులు చెప్పినా వినకుండా చాలామంది తొందరపడి విడాకులు తీసుకుంటారు. ఆ లిస్టులో నాగచైతన్య, సమంత కూడా ఉన్నారు. వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకొని చివరకు వాళ్ల కాపురాన్ని ముణ్ణాళ్ల ముచ్చగానే ముగించేశారు.

విడాకులు తీసుకొని అందరినీ షాకింగ్ కు గురిచేశారు. అసలే అక్కినేని ఫ్యామిలీకి కోడలుగా వెళ్లి విడాకులు తీసుకోవడం అనేది సమంతకే పెద్ద దెబ్బగా మారింది. పెళ్లి సమయంలో వాళ్లు ఎంత హంగామా చేశారో తెలుసు కదా. అసలు ఇండస్ట్రీ మొత్తం ఆ సమయంలో వాళ్ల పెళ్లి గురించే మాట్లాడుకుంది. చివరకు వాళ్ల జీవితాలు మాత్రం అస్తవ్యస్తం అయిపోయాయి.అయితే.. సమంత ఇటీవలే తన అరుదైన వ్యాధికి ట్రీట్ మెంట్ తీసుకొని ఇండియాకు తిరిగొచ్చింది. నిజానికి తను నటించిన శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడం కోసం తనకు ఆరోగ్యం బాగలేకున్నా ప్రమోషన్స్ లో పాల్గొన్నది. అయితే..

naga Chaitanya ready to Talk with samantha after divorce

naga Chaitanya ready to Talk with samantha after divorce

Naga Chaitanya – Samantha : ఇటీవలే ట్రీట్ మెంట్ తీసుకొని ఇండియాకు తిరిగొచ్చిన సమంత

ఆమెను ఎయిర్ పోర్ట్ లో చూసిన తన అభిమానులు షాక్ అయ్యారట. బక్కచిక్కిపోయి సమంత కనిపించడంతో అందరూ షాక్ అయ్యారట. ఆమె ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆ ఫోటోలను చూసి చైతూ కూడా సమంత ఆరోగ్యంపై ఆరా తీశారట. ఆమెను ఒకసారి పర్సనల్ గా మీట్ అయి తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవాలని నాగచైతన్య భావిస్తున్నారట. తమ మధ్య ఉన్న గొడవలను పక్కన పెట్టి ఒక ఫ్రెండ్ గా తనకు మద్దతుగా ఉండాలని.. తనను కేర్ తీసుకోవాలని నాగచైతన్య ఫిక్స్ అయ్యాడట. ఇది నిజమే అయితే.. అక్కినేని అభిమానులకు ఇంతకన్నా పెద్ద పండుగ ఇంకోటి ఉంటుందా?

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp