సమంత ని హీరోయిన్ గా రిజెక్ట్ చేసిన నాగ చైతన్య ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

సమంత ని హీరోయిన్ గా రిజెక్ట్ చేసిన నాగ చైతన్య ..?

సమంత .. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ క్రేజీ హీరోయిన్. ఇప్పుడు ఆహా లో సాం జాం టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తూ టాలీవుడ్ సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూస్ చేస్తోంది. ఈ షో తో జనాలకి బాగానే ఎంటర్‌టైన్ చేస్తోంది. అంతేకాదు సమంత నటించిన ఫస్ట్ డెబ్యూ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 త్వరలో అమెజాన్ ప్రైం లో స్ట్రీమింగ్ కాబోతోంది. కాగా సమంత – నాగ చైతన్య […]

 Authored By govind | The Telugu News | Updated on :6 January 2021,3:30 pm

సమంత .. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ క్రేజీ హీరోయిన్. ఇప్పుడు ఆహా లో సాం జాం టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తూ టాలీవుడ్ సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూస్ చేస్తోంది. ఈ షో తో జనాలకి బాగానే ఎంటర్‌టైన్ చేస్తోంది. అంతేకాదు సమంత నటించిన ఫస్ట్ డెబ్యూ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 త్వరలో అమెజాన్ ప్రైం లో స్ట్రీమింగ్ కాబోతోంది. కాగా సమంత – నాగ చైతన్య ఏ మాయ చేశావే సినిమా నుంచి మజిలీ వరకు నటించిన సినిమాలు అక్కినేని ఫ్యాన్స్ ని బాగానే ఆకట్టుకున్నాయి. సమంత – నాగ చైతన్య ల కాంబినేషన్ లో వచ్చిన ఏ మాయ చేశావే, ఆటో నగర్ సూర్య, మనం, మజిలీ సినిమాలలో ఒక్క ఆటోనగర్ సూర్య తప్ప మిగతా సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి.

Majili | Watch Movie of Zee Cinemalu Full Videos, News, Gallery online at  http://www.zeecinemalu.com - English

ఇక పెళ్ళి తర్వాత నాగ చైతన్య – సమంత నటించిన మజిలీ ఇద్దరి కెరీర్ లో ది బెస్ట్ మూవీగా నిలిచిపోతుంది. అయితే ఈ సినిమా తర్వాత సమంత ఓ బేబీ, జాను సినిమాలు చేసింది. ఈ సినిమాలలో ఓ బేబీ సూపర్ హిట్ గా నిలిచింది. కాని జాను భారీ డిజాస్టర్ గా మిగిలింది. వాస్తవంగా జాను సినిమాలో కూడా నాగ చైతన్య – సమంత కలిసి నటించాల్సి ఉందట. కాని నాగ చైతన్య కి కథ నచ్చక డ్రాపయ్యాడు. సమంత నటించి ఫ్లాప్ తన ఖాతాలో వేసుకుంది. కాగా మజిలీ తర్వాత అలాంటి కథ ఉంటే ఇద్దరం కలిసి నటిస్తామని కొందరు దర్శక, రచయితలకి చెప్పినట్టు వార్తలు వచ్చాయి.

Fall In Love With Musical Preview Of Aye Pilla Song

అయితే తాజా సమాచారం ప్రకారం ఆ వార్త కంప్లీట్ గా రూమర్ అని తేలిపోయింది. రీసెంట్ గా నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అన్న సినిమా కంప్లీట్ చేశాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. కాగా తాజాగా మనం ఫేం విక్రం కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ అన్న సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. హాకీ ప్లేయర్ గా నాగ చైతన్య నటిస్తున్న ఈ సినిమాలో సమంత ని హీరోయిన్ గా తీసుకుందామని దర్శకుడు విక్రం కుమార్, నిర్మాత దిల్ రాజు చెప్పగా నాగ చైతన్య సింపుల్ గా రిజెక్ట్ చేశాడట. మజిలీ వచ్చింది ఈ మధ్యనే కదా మళ్ళీ మా ఇద్దరిని కలిసి చూడాలంటే జనాలకి నచ్చదేమో .. వేరే అమాయిని తీసుకుందామని సమంత ని రిజెక్ట్ చేశాడట. ఆ రకంగా తాజా థాంక్యూ సినిమా లో సమంత నటించే ఛాన్స్ మిస్ అయిందట.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది