Naga Chaitanya : నాగ చైత‌న్య మరీ అంత చీపా.. ఆశ్చ‌ర్య‌పోతున్న నెటిజ‌న్స్

Authored By Sam C | The Telugu News | Published on: August 9, 2022, 1:40 pm

Naga Chaitanya : అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు, నాగార్జున త‌న‌యుడు, టాలీవుడ్ హీరో నాగ చైత‌న్య ఇటీవ‌లి కాలంలో ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తున్న విష‌యం తెలిసిందే. స‌మంత‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతూ నాలుగేళ్ల‌కే విడాకులు ఇచ్చాడు. ఇక అప్ప‌టి నుండి వార్త‌ల‌లో నిలుస్తున్నాడు. అయితే పరసనల్ లైఫ్ డిస్టర్బ్ గా ఉన్నా..సినిమాలను మాత్రం ఆపడం లేదు. వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ..ఫుల్ జోష్ మీద ఉన్నాడు. రీసెంట్ గా చేసిన ధ్యాంక్యూ సినిమా ఫ్లాప్ అయినా..తన నటనకి మాత్రం మంచి పేరు వచ్చింది. . 2009లో ‘జోష్‌’ చిత్రంతో అక్కినేని నాగార్జున నట వారసుడిగా పరిచయమైన చైత‌న్య సినీ కెరీల్‌లో ఎన్నో హిట్లు, ఫట్లు ఉన్నాయి.

Naga Chaitanya : నాగ చైత‌న్య రెమ్యున‌రేష‌న్..

తాజాగా చైతూ బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమీర్‌ ఖాన్‌ ‘లాల్ సింగ్‌ చద్దా’ చిత్రంలో చద్దా చడ్డీ బడ్డీ బాలాగా ఆకట్టుకోనున్నాడు. ఈ సినిమా రిలీజ్ కాకముందే బాలీవుడ్ లో మరో బంపర్ ఆఫర్ అందుకున్నాట్లు తెలుస్తుంది. ఇండియన్ పాపులర్ డైరెక్టర్ సంజయ్ లీలాభన్సాలి డైరెక్షన్ లో ఓ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. కాగా, ఇప్పుడు నాగ చైత్నయ రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇప్పటి వరకు నాగచైతన్య ఒక్కో సినిమాకి 10 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకునేవారట. కానీ, లాల్ సింగ్ చద్దా కి మాత్రం 5 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకున్నారట.

naga chaitanya remuneration for Laal Singh Chaddha

naga chaitanya remuneration for Laal Singh Chaddha

నాగ చైతన్య లాంటి మరో స్టార్ వార్సులు ఒక్కో సినిమా 60 కోట్లు, 70 కోట్లు..అల్లు అర్జున్ అయితే 120 కోట్లు పారితోషకంగా పుచ్చుకుంటున్నారు. కానీ, నాగ చైతన్య ఇంకా 10 రేంజ్ లోనే ఉండటం కొంచెం బాధకలిగించే విషయం అంటున్నారు అభిమానులు. ఇంత త‌క్కువ రేట్‌కి నాగ చైత‌న్య ప‌లుకుతుండ‌డం ఆయ‌న అభిమానుల‌ని క‌ల‌వ‌ర‌ప‌రుస్తుంది. చైతూ త్వ‌ర‌లో వెబ్ సిరీస్‌తో కూడా ప‌ల‌క‌రించ‌నున్నాడు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp