Naga Chaitanya : విడాకుల‌పై తొలిసారి స్పందించిన నాగ చైతన్య‌… అలా అనేశాడేంటి?

Authored By Sam C | The Telugu News | Published on: August 1, 2022, 5:40 pm

Naga Chaitanya : టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్‌గా ఉన్న నాగ చైత‌న్య‌, స‌మంత కొన్ని నెల‌ల క్రితం విడిపోయిన విష‌యం తెలిసిందే. డైవ‌ర్స్ తీసుకున్న‌ప్ప‌టి నుండి వారిద్ద‌రికి సంబంధించి అనేక వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. . తమ రిలేషన్ షిప్ ను నెక్స్ట్ లెవల్ కి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో.. 2017లో గోవా వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. చైతు-సామ్ ల వివాహం అప్పట్లో ఎంతో ఘనంగా జరిగింది. కాని ఎక్కువ కాలం సామ్-చైతూలు కలిసి ఉండలేకపోయారు. పెళ్లై నాలుగేళ్లు గడవక ముందే డివోర్స్ తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Naga Chaitanya : స్పందించాడుగా..

అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం ‘లాల్‌ సింగ్‌ చద్దా’ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో చై బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్‌ 11న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఓ ఇంగ్లిష్‌ చానల్‌తో ముచ్చటించాడు నాగ చైతన్య. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను పంచుకున్నాడు. ఇక అలాగే అందరు ఊహించినట్టే చైకి విడాకులపై ప్రశ్న ఎదురవగా ఆసక్తికరంగా స్పందించాడు. ‘నా వ్యక్తిగత జీవితం గురించి అందరు మాట్లాడుకోవడం అసహనం కలిగిస్తోంది. ప్రతి ఒక్కరికీ పర్సనల్‌ లైఫ్‌ అనేది ఉంటుంది

naga chaitanya responds on his divorce

naga chaitanya responds on his divorce

సమంతతో విడాకులపై ఇప్పటికే ప్రకటన చేశాం. అయితే దానికి కారణమేంటో ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ప్రస్తుతం ఎవరి వ్యక్తిగత జీవితాన్ని వారు జీవిస్తున్నాం. సమంత దారి సమంతదే.. నా దారి నాదే. ఇంతకంటే ఇంకా చెప్పాల్సిందేమి లేదు’ అంటూ కొంచెం ఘాటుగానే స్పందించాడు. రూమర్స్‌ని తానేప్పుడు పట్టించుకోనని, మొదట్లో ఆలోచించేవాడినని, కానీ ఇప్పుడు ఆ రూమర్స్ గురించి అంతగా ఆలోచించడం లేదని చై అన్నాడు. నాగ చైత‌న్య న‌టించిన థ్యాంక్యూ చిత్రం రీసెంట్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ మూవీ దారుణ‌మైన ఫ్లాప్‌గా నిలిచింది.

Sam C

No bio available for this author.

  1. "Elon Musk : ఇండియాలో ఎలాన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ.. స్టార్‌లింక్ లైసెన్స్‌పై కేంద్రం సంచలన నిర్ణయం!"

  2. "AP BC Politics : లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ ఓట్లపై రసవత్తర పోరు.. టీడీపీ, వైసీపీ మధ్య మొదలైన అసలైన మైండ్‌గేమ్!"

  3. "Chandrababu : జగనన్న కాలనీలపై కూటమి సర్కార్ సంచలన అడుగు.. 45 రోజుల డెడ్‌లైన్‌తో మంత్రుల కమిటీ ఏర్పాటు!"

  4. "Chinna Srinu : చిన్న శ్రీను లేకుండా విజయనగరంలో వైసీపీ నిలబడగలదా? బొత్స ఫ్యామిలీకి జీవన్మరణ సమస్యేనా..?"

  5. "AP Local Body Elections : ఈవీఎంలు లేవు.. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు! ఏపీ ఎస్ఈసీ ప్రకటనతో పొలిటికల్ వర్గాల్లో ప్రకంపనలు..!"

  6. "Telangana Current Bills : తెలంగాణ ప్రజలకు కరెంట్ ఛార్జీల షాక్ ? ట్రూ-అప్ భారంపై రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్..!"

  7. "Dasara Special Buses : దసరా ప్రయాణికులకు ఆర్టీసీ భారీ గుడ్‌న్యూస్.. ఏకంగా 5,261 స్పెషల్ బస్సులు, ఛార్జీల పెంపు ఉందా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp