Naga Chaitanya Samantha : నాగ చైత‌న్య‌- స‌మంత విడాకుల‌పై స‌మీప బంధువు షాకింగ్ కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Naga Chaitanya Samantha : నాగ చైత‌న్య‌- స‌మంత విడాకుల‌పై స‌మీప బంధువు షాకింగ్ కామెంట్స్

 Authored By ramu | The Telugu News | Updated on :17 May 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Naga Chaitanya Samantha : నాగ చైత‌న్య‌- స‌మంత విడాకుల‌పై స‌మీప బంధువు షాకింగ్ కామెంట్స్

Naga Chaitanya Samantha : టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ స‌మంత‌, నాగ చైత‌న్య ఇండ‌స్ట్రీలో మంచి జంట‌గా పేరు తెచ్చుకున్నారు. అక్కినేని నాగ చైతన్య, సమంత రూత్ ప్రభు జంటగా మొదట ‘ఏమాయ చేశావే’ సినిమా చేశారు. ఇది చేస్తున్న సమయంలో మంచి ఫ్రెండ్స్ అయిన వీళ్లు.. ‘ఆటోనగర్ సూర్య’ సినిమా చేసిన టైమ్‌లో లవ్‌లో పడ్డారు. అప్పటి నుంచి చాలా కాలం పాటు సీక్రెట్‌గా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఆ తర్వాత చై సామ్ పెద్దలను ఒప్పించి ఎంతో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత సమంత, నాగ చైతన్య ఎంతో క్రేజీగా గడిపారు.

Naga Chaitanya Samantha నిజం ఎంత‌ ?

తరచూ పార్టీలు చేసుకోవడం, హాలీడే ట్రిప్‌లకు వెళ్లడం వంటివి చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే తమకు సంబంధించిన పర్సనల్ విషయాలను సైతం ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. అదే సమయంలో ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉంటూ ఎన్నో విజయాలను కూడా దక్కించుకున్నారు. అయితే విడాకుల త‌ర్వాత స‌మంత‌, నాగ చైత‌న్య ఎప్పుడు కూడా క‌లిసింది లేదు. ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పక్కపక్కనే పాల్గొన్న సమంత రూత్ ప్రభు, నాగ చైతన్య ఫోటోలు అప్ప‌ట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వీరిద్దరూ మళ్లీ ఒక్కటవ్వాలని అభిమానులు ఆకాంక్షించారు.

Naga Chaitanya Samantha నాగ చైత‌న్య‌ స‌మంత విడాకుల‌పై స‌మీప బంధువు షాకింగ్ కామెంట్స్

Naga Chaitanya Samantha : నాగ చైత‌న్య‌- స‌మంత విడాకుల‌పై స‌మీప బంధువు షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ జంట సమంత, నాగ చైతన్య ఎందుకు విడాకులు తీసుకున్నారన్న విషయం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. అంతా సవ్యంగా సాగిపోతోన్న సమయంలోనే సమంత స్వయంగా నాగ చైతన్యను విడాకులు అడిగిందట. దీంతో అతడు కూడా దీనికి ఒప్పుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. సమంత రూత్ ప్రభుకు మయోసైటిస్ వ్యాధి ఉన్నట్లు వైద్య పరీక్షల్లో నాగ చైతన్య కంటే ముందే తెలుసుకుందట. దీంతో ఫ్యూచర్‌లో ఇబ్బందులు వస్తాయని భావించిన ఆమె విడాకుల ప్రతిపాదన పెట్టినట్లు తెలిసింది. అంటే.. అనారోగ్యం కారణంగానే సమంత, నాగ చైతన్య విడిపోయారని సామ్ స‌మీప బంధువు చెప్పిన‌ట్టు తెలుస్తుంది.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి