Samantha : శోభిత విషయంలో నాగ చైతన్య తేల్చేది ఎప్పుడో తెలుసా సమంత లింక్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : శోభిత విషయంలో నాగ చైతన్య తేల్చేది ఎప్పుడో తెలుసా సమంత లింక్..!

 Authored By prabhas | The Telugu News | Updated on :21 December 2022,3:40 pm

Samantha : టాలీవుడ్ లో కూల్ అండ్ కామ్ గోయింగ్ హీరో అంటే నాగచైతన్య పేరు మొదట వినిపిస్తుంది అనడంలో సందేహం లేదు. నాగచైతన్య ప్రేమలో ఉన్నాడు.. అది కూడా సమంతను ప్రేమిస్తున్నాడు అని తెలియగానే అంతా షాక్ అయ్యారు. నాగచైతన్య వంటి ఒక కూల్ బాయ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రేమిస్తున్నాడు అంటే కచ్చితంగా అది సంచలనమే అనుకున్నారు. ఇద్దరు కూడా ప్రేమించుకుంటు న్నట్లు అధికారికంగా ప్రకటించారు.. కొన్నాళ్లకే పెళ్లి కూడా చేసుకున్నారు. వీరిద్దరి జంటని చూడముచ్చటైన జంటగా అభిమానులు అభివర్ణించారు. అలాంటి చూడమచ్చటైన జంట యొక్క సంసార జీవితం మూడు నాలుగు ముచ్చటగానే మారి పోయింది.సమంత మరియు నాగచైతన్య విడిపోయారు.

ఏడాదికి ముందే వారిద్దరు విడాకులు తీసుకొని ఎవరికి వారే అన్నట్లు జీవితం లో ముందుకు సాగిపోతున్నారు. ఈ సమయంలో నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాల తో ప్రేమలో ఉన్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. నాగచైతన్య ఒక్కసారి ప్రేమలో పడటమే చాలా పెద్ద విషయం అని చాలా మంది అంటున్నారు. అలాంటిది విడాకులు అయిన తర్వాత మళ్ళీ ప్రేమలో పడడం అంటే కచ్చితంగా అది నమ్మశక్యంగా లేదు అంటూ కొందరు మాట్లాడుకుంటూ ఉంటే.. మరి కొందరు మాత్రం శోభిత నాగచైతన్య ప్రస్తుతం బెంగళూరు లేదా ముంబైలో సహజీవనం చేస్తున్నారని బలంగా వాదిస్తున్నారు. ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతం నాగచైతన్య పెళ్లి గురించి ఎలాంటి ప్రస్తావన మాత్రం తీసుకురావడం లేదు. నాగ చైతన్య మరియు శోభిత ధూళిపాల యొక్క పెళ్లి విషయం క్లారిటీ రావాలి అంటే సమంతకు సంబంధించిన రెండు విషయాలు క్లారిటీ రావాల్సి ఉంది.

Naga Chaitanya Second Marriage issue interesting update in Samantha

Naga Chaitanya Second Marriage issue interesting update in Samantha

ఒకటి ఆమె అనారోగ్య సమస్య రెండు ఆమె యొక్క రెండవ పెళ్లి. ఈ రెండు విషయాలు క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే నాగచైతన్య రెండవ పెళ్లి ఉంటుందని ఆయన సన్నిహితులు అంటున్నారు. నాగచైతన్య మొదట రెండో పెళ్లి చేసుకుంటే తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే సమంత ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే నాగచైతన్య నిర్ణయం తీసుకుంటే బావుంటుందని అక్కినేని కుటుంబ పెద్దలు కూడా సూచించారట. అందుకే ఇప్పుడు నాగచైతన్య కేవలం సహజీవనం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అతి త్వరలోనే సమంత ఒక నిర్ణయం తీసుకుంటే అప్పుడు చైతూ కూడా పెళ్లి చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటూ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి